Share News

KFC: కేఎఫ్‌సీ నుంచి క్రేజీ పెర్ఫ్యూమ్‌..స్మెల్ ఎలా వస్తుందంటే

ABN , Publish Date - May 01 , 2024 | 11:45 AM

ప్రస్తుతం అనేక మంది బార్బెక్యూ వంటకాలను ఆరగించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అనేక ప్రాంతాల్లో వీటికి ఫుల్లు డిమాండ్ ఉంటుంది. వీదేశాల్లో అయితే వీటి గురించి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ KFC వినూత్నంగా ఆలోచించి No. 11 Eau De BBQ పెర్ఫ్యూమ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

 KFC: కేఎఫ్‌సీ నుంచి క్రేజీ పెర్ఫ్యూమ్‌..స్మెల్ ఎలా వస్తుందంటే
KFC launches perfume which smells like new Ultimate BBQ

ప్రస్తుతం అనేక మంది బార్బెక్యూ వంటకాలను ఆరగించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అనేక ప్రాంతాల్లో వీటికి ఫుల్లు డిమాండ్ ఉంటుంది. వీదేశాల్లో అయితే వీటి గురించి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ KFC వినూత్నంగా ఆలోచించి No. 11 Eau De BBQ పెర్ఫ్యూమ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పెర్ఫ్యూమ్‌ స్మోకీ వుడ్, సిజ్లింగ్ మసాలాలు, మెరినేట్ చేసిన మాంసాల సువాసనతో ఉంటుందని తయారీ దారులు తెలిపారు. దీని ఒక రకమైన సువాసన మీ ఇంద్రియాలను ప్రేరేపిస్తుందని, రుచిని కోరుకునేలా చేస్తుందని అన్నారు.


KFC UK ఈ పెర్ఫ్యూమ్‌ పరిమిత ఎడిషన్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ప్రత్యేకమైన సువాసన కలిగిన ఈ 100ml బాటిల్ ధర సుమారు రూ. 1150. వెబ్‌సైట్ ప్రకారం ఈ పరిమిత ఎడిషన్ సువాసన గల పెర్ఫ్యూమ్‌ మే 6న మొదటి బ్యాచ్ విక్రయించబడుతుంది. నెం.11 Eau de BBQ విక్రయం ద్వారా వచ్చే ఆదాయం KFC ఫౌండేషన్‌కు వెళ్తుందని కంపెనీ పేర్కొంది. ఇది UK అంతటా ఉన్న సంస్థలకు యువత వారి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు, సానుకూల భవిష్యత్తును నిర్మించడానికి సపోర్ట్ చేస్తుంది.


No 11 Eau de BBQ సరికొత్త అల్టిమేట్ BBQ బర్గర్ నోరూరించే సువాసనను సంగ్రహిస్తుందని KFC&I ఫోబ్ సిమ్స్‌లోని బ్రాండ్ మేనేజర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మీకు ఇది కొత్త అనభూతిని ఇస్తుందని, ఆసక్తి ఉన్న KFC అభిమానులు ఆన్‌లైన్ షాప్ ద్వారా ఈ బాటిల్‌ను ప్రీ ఆర్డర్ చేయవచ్చని అన్నారు. అయితే ఈ రకమైన ప్రయోగం ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆ టీచర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. పిల్లల సంతోషాన్ని క్యాప్చర్ చేసేందుకు ఆమె ఏం చేసిందో చూడండి..


Viral Video: అలా కనిపిస్తున్నారు కానీ, వీళ్లు మామూలు దొంగలు కారు.. వీరి మోసం ఏ రేంజ్‌లో ఉంటుందంటే..!

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 01 , 2024 | 11:52 AM