Share News

Personality Test: మీ మొహం ఏ షేప్‌లో ఉంది?.. మీ మొహం ఆకృతిని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు..!

ABN , Publish Date - Apr 27 , 2024 | 10:22 AM

``ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్`` అనేది ఇంగ్లీష్‌లోని ఓ సామెత. అంటే మీ మొహం చూసి మీ ఆలోచనలను చెప్పెయ్యొచ్చు అని దాని అర్థం. ఫేస్ రీడింగ్ అనేది కూడా ఎప్పట్నుంచో ప్రాచుర్యంలో ఉంది. మీ మొహం ఆకృతి ద్వారా మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు.

Personality Test: మీ మొహం ఏ షేప్‌లో ఉంది?.. మీ మొహం ఆకృతిని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు..!
Face Shape

``ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్`` అనేది ఇంగ్లీష్‌లోని ఓ సామెత. అంటే మీ మొహం చూసి మీ ఆలోచనలను చెప్పెయ్యొచ్చు అని దాని అర్థం. ఫేస్ రీడింగ్ అనేది కూడా ఎప్పట్నుంచో ప్రాచుర్యంలో ఉంది. మీ మొహం ఆకృతి (Face Shape) ద్వారా మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని ఫేస్ రీడింగ్‌లో నిపుణుడైన జీన్ హానర్ చెబుతున్నారు. మీరు సాధారణంగా జీవితంలోని సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో కూడా మీ మొహం షేప్ ద్వారా తెలుసుకోవచ్చట (Personality Test).


సాధారణంగా చాలా మంది మొహాలు గుండ్రంగా, చతురస్రాకారంలో, కోడి గుడ్డు ఆకారంలో లేదా హృదయం ఆకారంలో ఉంటాయి. మొహం ఆకృతిని బట్టి కొందరిలో ప్రత్యేకంగా కొన్ని లక్షణాలను జీన్ హానర్ కనుగొన్నారట. మరి, మీ మొహం మీ వ్యక్తిత్వం గురించి ఏమి వెల్లడిస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే పదండి మరి..


face.jpg

గుండ్రని మొహం (Round Face)..

మీ మొహం గుండ్రంగా కనుక ఉన్నట్టైతే.. మీరు దయగా, ఉదారంగా, ఇతరులకు విలువనిచ్చే వ్యక్తిగా ఉంటారు. చాలా మృదువుగా మాట్లాడుతూ ఇతరులను నొప్పించకుండా వ్యవహరిస్తారు. నిస్వార్థంగా, అమాయకంగా ఉంటారు. ఆయా లక్షణాల కారణంగా ఒక్కోసారి ఇతరుల చేతుల్లో మోసపోతుంటారు కూడా.

హృదయాకార మొహం (Heart Face)..

మీ మొహం హృదయాకారంలో ఉన్నట్టైతే.. మీరు చాలా సృజనాత్మక వ్యక్తి. మీరు దృఢమైన మనస్సును కలిగి ఉంటారు. అలాగే సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు. మీకు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మీరు లోతైన ఆలోచనాపరులు, కొత్త సమాచారం మరియు ఆలోచనలను గ్రహించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉంటారు


కోల మొహం (Oval Face)..

మీ మొహం కోలగా, ఓవల్ షేప్‌లో ఉన్నట్టైతే.. మీరు చాలా తెలివిగా, ఆచరణాత్మకంగా, పద్దతిగా ఉంటారు. అనుకున్నది సాధించేవరకు పట్టుదలగా కృషి చేస్తారు. కోల మొహం కలిగిన వారు సాధారణంగా అధిక ఐక్యూని కలిగి ఉంటారు. ఇతరులను మీ వైపునకు ఆకర్షించుకోవడంలో సిద్ధహస్తులు.

చతురస్రాకార మొహం (Square Face)..

మీది స్క్వేర్ షేప్ మొహం అయినట్టైతే.. మీరు చాలా చురుగ్గా ఉంటారు. మీకు పోటీపడే స్వభావం ఎక్కువ. మంచి వ్యాపారవేత్తలు కాగలిగిన లక్షణాలు మీకు పుష్కలం. మీకు పదునైన తెలివి, విశ్లేషణాత్మక శక్తి కూడా ఎక్కువ. అధిక ఒత్తిడితో కూడిన వాతావరణంలో కూడా ప్రశాంతంగా పని చేయగలరు.

ఇవి కూడా చదవండి..

Viral Video: తమ్ముడు తెలివైనవాడు.. పెళ్లికి ముందే అసలు విషయం తెలుసుకున్నాడు.. పోస్ట‌ర్‌పై వధువు పేరు చూస్తే..


Shocking Video: వామ్మో.. అంత అహంకారమా? కారును అడ్డుకున్న పోలీసులపై పాక్ మహిళ తీవ్ర ఆగ్రహం.. ఏం చేసిందో చూస్తే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2024 | 10:25 AM