Share News

Viral Video: వాసన చూసి గడ్డిలో వెతుక్కుంటూ వెళ్లిన పులి.. చివరకు ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..

ABN , Publish Date - Apr 23 , 2024 | 08:07 PM

పులి ఎంత భయంకరంగా ఎటాక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేటను ఒక్కసారి టార్గెట్ చేసిందంటే.. ఎంత దూరమైన వెంబడించి మరీ నోట కరుచుకుని వెళ్లిపోతుంది. అయితే అప్పుడప్పుడూ అవి వాసన చూసి కూడా ఎంతో తెలివిగా వేటాడగలవు. ఇలాంటి...

Viral Video: వాసన చూసి గడ్డిలో వెతుక్కుంటూ వెళ్లిన పులి.. చివరకు ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..

పులి ఎంత భయంకరంగా ఎటాక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేటను ఒక్కసారి టార్గెట్ చేసిందంటే.. ఎంత దూరమైన వెంబడించి మరీ నోట కరుచుకుని వెళ్లిపోతుంది. అయితే అప్పుడప్పుడూ అవి వాసన చూసి కూడా ఎంతో తెలివిగా వేటాడగలవు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పులి వాసన చూస్తూ గడ్డిలో వెతుక్కుంటూ వెళ్తోంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పులి వేట కోసం వెతుకుతుండగా.. దానికి సమీపంలో ఏదో జంతువు ఉన్నట్లు వాసన వస్తుంది. వాసన రాగానే అలెర్ట్ అయిన పులి.. గడ్డిలో వెతుక్కుంటూ వెళ్తుంది. సరిగ్గా వేట ఉన్న ప్రాంతానికి వాసన చూస్తూ వెళ్తుంది. అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా దాడి చేసి, (Tiger attacking fawn) గడ్డిలో నుంచి ఓ పిల్ల జింకను నోట కరుచుకుంటుంది. జింక పిల్ల ఎంత తప్పించుకోవాలని చూసినా పులికి చిక్కక తప్పని పరిస్థితి.

Viral Video: హాస్టళ్లలో ఇలాంటి సమస్య కూడా రావొచ్చు.. పాపం..! ఇతడి పరిస్థితి ఏమైందంటే..

జింక పిల్లను నోట కరుచుకున్న పులి అక్కడి నుంచి తాపీగా మరో చోటికి తీసుకెళ్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులి దాడి అంటే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘అంత పెద్ద పులికి ఇది అల్పాహారంతో సమానం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును.. 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

Updated Date - Apr 23 , 2024 | 08:07 PM