Share News

Extramarital Affair: సౌదీలో భర్త కష్టాలు.. ఇండియాలో ప్రియుడితో భార్య.. కట్ చేస్తే కథలో బిగ్ ట్విస్ట్

ABN , Publish Date - Apr 23 , 2024 | 09:16 PM

భార్యాపిల్లలకు ఆర్థికపరమైన లోటు లేకుండా చూసుకోవాలని.. ఆ భర్త తన కోరికల్ని, ఆశయాల్ని చంపుకొని దేశం కాని దేశానికి వెళ్లాడు. అక్కడ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని.. భారత్‌లో ఉన్న తన కుటుంబానికి చేరవేస్తూ వచ్చాడు. తాను అక్కడ ఇబ్బందులు పడుతూ..

Extramarital Affair: సౌదీలో భర్త కష్టాలు.. ఇండియాలో ప్రియుడితో భార్య.. కట్ చేస్తే కథలో బిగ్ ట్విస్ట్

భార్యాపిల్లలకు ఆర్థికపరమైన లోటు లేకుండా చూసుకోవాలని.. ఆ భర్త తన కోరికల్ని, ఆశయాల్ని చంపుకొని దేశం కాని దేశానికి వెళ్లాడు. అక్కడ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని.. భారత్‌లో ఉన్న తన కుటుంబానికి చేరవేస్తూ వచ్చాడు. తాను అక్కడ ఇబ్బందులు పడుతూ.. ఇక్కడ తన కుటుంబానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. కానీ.. ఇందుకు ప్రతిఫలంగా అతనికి ఏం దక్కింది? భార్య నుంచి దారుణమైన మోసం. అక్కడేమో భర్త ఒళ్లు హూనం చేసుకొని కష్టపడుతుంటే.. ఇక్కడ ఆమె తన ప్రియుడితో సరసాసల్లాపాలు కొనసాగించింది. చివరికి.. ఈ విషయం భర్తకు తెలియడంతో, వ్యవహారం చాలా పెద్దదైంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


టీ పెట్టిన చిచ్చు.. పెళ్లిలో కొట్టేసుకున్న బంధువులు.. చివర్లో పెద్ద ట్విస్ట్

ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లోని కొత్వాలి దేహత్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కొంతకాలం క్రితం స్థానికంగా ఉండే మహిళతో వివాహం అయ్యింది. మొదట్లో వీరి సంసార జీవితం బాగానే సాగింది కానీ, ఆర్థిక సమస్యల కారణంగా భార్త ఉపాధి కోసం సౌదీ అరేబియాకి వెళ్లాడు. అక్కడ తనకు దొరికిన ఉద్యోగంలో చేరి, నానా ఇబ్బందులు పడుతూ భార్యకు డబ్బులు పంపిస్తూ వచ్చాడు. అయితే.. భార్య మాత్రం పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే.. ఆమె పరాయి వ్యక్తితో పెట్టుకున్న సంబంధం గురించి సౌదీలో ఉన్న భర్తకు తెలిసిపోయింది. తన ప్రియుడితో ఆమె సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి తన కంటపడటంతో.. ఈ వివాహేతర సంబంధం బయటపడింది. దీంతో.. భర్త హుటాహుటినా సౌదీ నుంచి తిరిగొచ్చాడు. ఆ వీడియో గురించి ఆమెని నిలదీశాడు.

ధోనీ నెక్ట్స్ సీజన్‌లో ఉంటాడా.. ఆ వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?

తన వివాహేతర బంధం గురించి భర్తకు తెలిసిపోవడంతో.. అతని అడ్డు తొలగించుకోవాలని భార్య నిర్ణయించుకుంది. తన ప్రియుడితో కలిసి ఓ స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే.. ఏప్రిల్ 22న మరో గ్రామం నుంచి భర్త స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, భార్య ప్రియుడు తన ముగ్గురు సహచరులతో కలిసి అతనిపై కత్తితో దాడి చేశాడు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న భర్త, స్థానికుల సహకారంతో ఆసుపత్రిలో చేరాడు. అనంతరం తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అధికారులు అతని భార్యతో పాటు ప్రియుడు, మరో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుని విచారిస్తున్నామని, నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Read Latest Prathyekam News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 09:16 PM