Share News

దేశంలోనూ ప్రభుత్వాన్ని మార్చండి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:11 PM

తెలంగాణలో మార్చినట్లే దేశం లోనూ ప్రభుత్వాన్ని మార్చాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, నస్పూర్‌లో శని వారం రాత్రి నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రజా ఆశీర్వాద సభ, ఎన్నికల ప్రచార సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

దేశంలోనూ ప్రభుత్వాన్ని మార్చండి

ఏసీసీ/నస్పూర్‌/శ్రీరాంపూర్‌, ఏప్రిల్‌ 27: తెలంగాణలో మార్చినట్లే దేశం లోనూ ప్రభుత్వాన్ని మార్చాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, నస్పూర్‌లో శని వారం రాత్రి నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రజా ఆశీర్వాద సభ, ఎన్నికల ప్రచార సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ విదే శాల నుంచి నల్ల ధనం తెప్పించి ప్రతీ ఒక్కరి అకౌంట్‌లో రూ.15లక్షలు వేస్తానని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు, న్యాయం చేసేందుకు రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌, మణిపూర్‌ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేశారన్నారు. దీంతో ప్రధాని మోదీ రాహుల్‌కు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలు పరిష్కార మవుతా యని అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తగా విజయం సాధించిన గడ్డం వంశీ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ ఎన్నిక లు ఒక తంతు మాత్రమేనని, ప్రజాదరణ చూస్తుంటే వంశీ గెలవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. సింగరేణి కార్మికులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసగించిందని, టీబీజీకేఎస్‌ కార్మికులను దోపిడీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 900 ఉద్యోగాలు ఇచ్చా మని, 750 మంది డిపెండెంట్లకు ఉపయోగ పడేలా వయోపరిమితి 40 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు. అతి తక్కువ పెన్షన్‌ పొందుతున్న రిటైర్డ్‌ సింగరేణి కార్మికులకు తెల్లరేషన్‌కార్డు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మంచి ర్యాల నియోజకవర్గంలో లక్ష మెజారిటీ ఇవ్వాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కోరారు. ప్రేంసాగర్‌ రావుకు 66 వేల మెజారిటీ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని, వంశీని సైతం అలాగే గెలిపించాలని కోరారు. ప్రజలందరి ఆశీర్వాదాలతో తాను పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించడం ఖాయమని ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. నిధులు, నీళ్లు, నియామకాలు పేరు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్‌ తెలం గాణను కన్నీటి, నిరుద్యోగ రాష్ట్రంగా మార్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఐదు హామీలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెందిన దాదాపు 300 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంత్రి శ్రీధర్‌ బాబు, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, శ్రీనివాస్‌, హర్కర వేణుగోపాల్‌, రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడు శివసేనా రెడ్డి, జాతీయ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, చెన్నూరు, రామగుండం ఎమ్మెల్యేలు గడ్డం వివేక్‌, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:11 PM