Share News

ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయం

ABN , Publish Date - Apr 23 , 2024 | 10:54 PM

ఎన్నికలప్పుడే నాయకులు గ్రామానికి వచ్చి హామీలు ఇస్తారని, అనంతరం హామీలను నెరవేర్చడం లేదని మండలంలోని రాజా రం గ్రామస్థులు వాపోయారు. అందుకే ఈసారి జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు వేయమని వారు తీర్మానించారు. దశాబ్దాలుగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గ్రామస్థులంతా మంగళవారం మా మిడితోటలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఓట్లు వేయవద్దని తీర్మానించారు.

ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయం

కోటపల్లి, ఏప్రిల్‌ 23: ఎన్నికలప్పుడే నాయకులు గ్రామానికి వచ్చి హామీలు ఇస్తారని, అనంతరం హామీలను నెరవేర్చడం లేదని మండలంలోని రాజా రం గ్రామస్థులు వాపోయారు. అందుకే ఈసారి జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు వేయమని వారు తీర్మానించారు. దశాబ్దాలుగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గ్రామస్థులంతా మంగళవారం మా మిడితోటలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఓట్లు వేయవద్దని తీర్మానించారు. రాజారం గ్రామపంచా యతీలో రాజారం, కొత్తపల్లి రెండు గ్రామాలు ఉం డగా సుమారు 952 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామానికి రహదారి మంజూరైనా రిజర్వు ఫారెస్టు పేరుతో పనులను అర్థంతరంగా నిలిపివేశారు. దీంతో గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోగా ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోతాయని గ్రామస్థులు వాపోయారు. గ్రామంలో ప్రాథమిక విద్య అందు బాటులో ఉండగా హైస్కూలు విద్య కోసం 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న దేవులవాడ ఉన్నత పాఠ శాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రా మంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదని, అలాంట ప్పుడు తాము ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ప్రా ణహిత, గోదావరి నదులు తలాపునే ప్రవహిస్తున్నా తాగు నీటి సౌకర్యం లేకుండా పోయిందన్నారు. ఓట్లకు వచ్చే నాయకులు హామీలు ఇస్తున్నారే కానీ సమస్యలు తీర్చడం లేదన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఓట్లు వేయమని, ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు గ్రామ స్థులు ప్రకటించారు.

Updated Date - Apr 23 , 2024 | 10:54 PM