Share News

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:09 PM

సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల విధు లను పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల సాధా రణ పరిశీలకులు రావేష్‌ గుప్తా అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, డీసీపీ అశోక్‌కుమార్‌, ప్రత్యే క ఉపపాలన అధికారి చంద్రకళతో కలిసి సూక్ష్మ పరిశీకుల ర్యాండమైజే షన్‌ ప్రక్రియ నిర్వహించారు.

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27: సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల విధు లను పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల సాధా రణ పరిశీలకులు రావేష్‌ గుప్తా అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, డీసీపీ అశోక్‌కుమార్‌, ప్రత్యే క ఉపపాలన అధికారి చంద్రకళతో కలిసి సూక్ష్మ పరిశీకుల ర్యాండమైజే షన్‌ ప్రక్రియ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ పరిధి లోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో జరగనున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ చేశామన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి 30 మంది, బెల్లంపల్లి 33, మంచిర్యాల నియోజకవర్గానికి 32 మంది సూక్ష్మ పరిశీలకులను కేటా యించామన్నారు. లీడ్‌ డిస్ర్టిక్‌ మేనేజర్‌ తిరుపతి, ఎన్నికల తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఈ డిస్ర్టిక్‌ మేనేజర్‌ సునీల్‌, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికలల్లో నిబంధనల ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని రావేష్‌ గుప్తా అన్నారు. డీసీపీ అశోక్‌కుమార్‌, ఆర్డీవో రాములుతో కలిసి కంట్రోల్‌ రూమ్‌, వెబ్‌కాస్టిం గ్‌, మీడియా సెంటర్‌లను తనిఖీ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు పలు ప్రాంతాల్లో సెల్ఫీ బోర్డులను ఏర్పాటు చేశామని, ఇందులో సెల్ఫీలు దిగి వాట్సాప్‌ సోషల్‌ మీడియాలో పెట్టి ప్రచారం చేయాలన్నారు. ఎన్నికల తహసీల్దార్‌ శ్రీనివాస్‌ సహాయ కార్మిక శాఖ కమిషనర్‌ వినీత తదితరులు పాల్గొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లను పర్యవేక్షించాలి

హాజీపూర్‌: ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్‌ కళా శాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లపై అధికారులు పర్యవేక్షించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రావేష్‌ గుప్తా పేర్కొన్నారు కౌంటింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌, డీసీపీ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ ప్రక్రి యకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్‌ రోజున బందోబస్తు నిర్వహించాలన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

స్ర్టాంగ్‌రూంలను పరిశీలన

చెన్నూరు: మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ర్టాంగ్‌ రూమ్‌లను శనివారం ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ రవీష్‌గుప్తా పరిశీలించారు. విధుల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశా లలోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు, సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలన్నారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి చంద్రకళ, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎన్నికల డీటీ లక్ష్మీనారాయణ ఉన్నారు.

సకాలంలో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలి

జైపూర్‌: ఓటర్లకు సకాలంలో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని ఎన్నికల పరిశీలకులు రవీష్‌గుప్తా పేర్కొన్నారు. మండల కేంద్రంలోని 95, 96 పోలింగ్‌ కేంద్రాలను ఆయన సందర్శించారు. పోలింగ్‌ కేంద్రాల్లోని మూత్రశాలలు, నీటి వసతి తదితర వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు, పోలింగ్‌ సిబ్బందికి సౌకర్యాలు కల్పించడంలో అశ్రద్ధ వహించకూడదని సూచించారు. జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ వనజారెడ్డి, సెక్టార్‌ అధికారి వినీష ఉన్నారు.

పోలింగ్‌ కేంద్రం పరిశీలన

కోటపల్లి: నక్కలపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు రవీష్‌ గుప్తా పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. మారుమూల ప్రాంతాల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్‌ శాతంపై ఆరా తీశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశాన్ని కల్పిం చాలని అధికారులను ఆదేశించారు. సీఐ సుధాకర్‌, ఎంపీడీవో ఆకుల భూమన్న, తహసీల్దార్‌ మహేంద్రనాధ్‌, ఎస్‌ఐ రాజేందర్‌, ఆర్‌ఐ రాజలింగు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:09 PM