Share News

Kumaram Bheem Asifabad : అలంకారప్రాయంగా.. క్రీడా మైదానాలు

ABN , Publish Date - Apr 22 , 2024 | 10:43 PM

వాంకిడి, ఏప్రిల్‌ 22: గ్రామీణప్రాంత విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఊరూరా తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.లక్ష్యల్లో వ్యయం చేసింది. వాటిని ఏర్పాటు చేసినప్పటి నుంచి నిర్వహణ పట్టించుకోకపోవడం, కొన్ని మైదానాలు ఆటలకు అనువుగా లేకపోవడంతో నిర్దేశించిన లక్ష్యం నెరవేరడంలేదు.

Kumaram Bheem Asifabad :  అలంకారప్రాయంగా.. క్రీడా మైదానాలు

- నిర్వహణ శూన్యం

- మైదానాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు

- నిరుపయోగంగా క్రీడాకిట్లు

వాంకిడి, ఏప్రిల్‌ 22: గ్రామీణప్రాంత విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఊరూరా తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.లక్ష్యల్లో వ్యయం చేసింది. వాటిని ఏర్పాటు చేసినప్పటి నుంచి నిర్వహణ పట్టించుకోకపోవడం, కొన్ని మైదానాలు ఆటలకు అనువుగా లేకపోవడంతో నిర్దేశించిన లక్ష్యం నెరవేరడంలేదు. అనేక పంచాయతీల్లో క్రీడాప్రాంగణాల సౌకర్యాల కల్పనలో అధికారులు పట్టించకోకపోవడంతో అవి అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలోని 15మండలాల్లో 1102క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 902ప్రాంగణాలకు ప్రభుత్వస్థలం గుర్తించగా మిగితా 200ప్రాంగణాలకు ప్రభుత్వ స్థలాలను గుర్తించలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 878క్రీడాప్రాంగణాలను పూర్తిచేసినట్లు అధికారుల లెక్కలు తెలుపుతునప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా అన్ని విధాల సౌకర్యాలు క్పలించిన దాఖలాలు లేవు. ఒక్కో ప్రాంగణలో భూమి చదును చేసేందుకు, మొక్కలు నాటేందుకు సౌకర్యాల కల్పనకు రూ.2లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అనేక ప్రాంగణాల్లో నామ్‌కే వాస్తేగా పనులు చేసి అధికారులు చేతులు దులుపినట్లు ఆరోపణలు ఉన్నాయి. క్రీడా ప్రాంగణాలపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుండడంతో అధికారులు బోర్డులు ఏర్పాటు చేసి రికార్డుల్లో మాత్రం పనులు పూర్తి అయినట్లు చూపి స్తున్నారు. దీంతో చాలా మైదానాలు చదును చేయకపోగా పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంగణాలు గ్రామాలకు దూరంగా ఉండి కనీసం సరైన రహదారి సైతం లేకుండా ఉన్నాయి.

- నిరుపయోగంగా కిట్లు..

క్రీడాప్రాంగణాల కోసం గత ప్రభుత్వం జిల్లాకు 937క్రీడాకిట్లను మంజూరు చేసింది. ఒక్కో కిట్లో క్రికెట్‌, వాలీబాల్‌ కిట్‌, టీషర్టులు, మూడు జతల డంబె ల్స్‌తో పాటు మొత్తం 23రకాల ఆట పరికరాలు ఉన్నాయి. గ్రామ పంచా యతీల వారీగా అధికారులు కిట్లను పంపిణీచేశారు. ప్రస్తుతం క్రీడా మైదా నాలు ఆటలకు అనువుగా లేకపోవడంతో వాటిని వినియోగించుకోలేని పరి స్థితి ఏర్పడింది. దీంతో క్రీడా కిట్లు పంచాయతీల్లో మూలకు చేరాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 22 , 2024 | 10:43 PM