Share News

Kumaram Bheem Asifabad: పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Apr 22 , 2024 | 10:39 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌/వాంకిడి, ఏప్రిల్‌ 22: జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠ శాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను మే31లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad:  పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌ రూరల్‌/వాంకిడి, ఏప్రిల్‌ 22: జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠ శాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను మే31లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లాలోని ఆసిఫాబాద్‌ మండలం రాజురా మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశా లను, వాంకిడి మండలంలోని బోర్డాగ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాలను అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారితో కలసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సహాయక ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో తయారు చేసిన ప్రతిపాదనలలో పొందుపరిచిన అంశాలను సూక్ష్మంగా పరిశీలించి ఇంజనీరింగ్‌ అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా విద్యుదీ కరణ, తాగునీరు, మరమ్మతుల పను లను చేపడతామన్నారు. ఈ క్రమంలో వేసవి సెలవుల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలని తెలిపారు. పాఠశాలలో చేపట్టాల్సిన అత్యవసర పనులను ప్రాధా న్యతనిచ్చి ప్రతిపాదనలను రూపొందిం చాలన్నారు. తాగునీటి కొరకు పాఠశాలలో ఉన్న చేతి పంపులలోనే సబ్మెర్సిబుల్‌ మోటారును బిగించి బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రూఫ్‌ లీకేజీని అరికట్టేందుకు కెమికల్‌ ట్రీట్మెంట్‌ను చేయాలని తెలిపారు. మరమ్మతు పనుల్లో నాణ్యత లోపించకుండా పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో అశోక్‌, సెక్టోరల్‌ అధికారి భరత్‌ కుమార్‌, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రామకృష్ణ, డీవైఈఈ శ్రీనివాస్‌, ఎస్‌ఈ గిరీష్‌, ఎంపీడీవో, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - Apr 22 , 2024 | 10:39 PM