Share News

Kumaram Bheem Asifabad: పోలింగ్‌శాతం పెరిగేందుకు కృషి చేయాలి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:07 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 27: పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా మే13న నిర్వహించే పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు కృషిచేయాలని ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్ని కల సాధారణ పరిశీలకుడు రాజేంద్ర విజయ్‌ అన్నారు.

Kumaram Bheem Asifabad: పోలింగ్‌శాతం పెరిగేందుకు కృషి చేయాలి

- పార్లమెంట్‌ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేంద్ర విజయ్‌

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 27: పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా మే13న నిర్వహించే పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు కృషిచేయాలని ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్ని కల సాధారణ పరిశీలకుడు రాజేంద్ర విజయ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో స్వీప్‌ ఆక్టి విటీస్‌లో ఐ ఓట్‌ ఫర్‌ షూర్‌లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారితో కలిసి సెల్ఫీబోర్డు వద్ద ఫొటోదిగారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో మే13న జరగనున్న పోలింగ్‌ కార్యక్రమంలో అర్హతగల ప్రతి ఒక్క రూ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా విస్తృతస్థాయి ప్రచారం, అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్ని కల నిర్వహణకు ప్రత్యేకబృందాలు, అధికా రులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బం దీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలోని పోలింగ్‌కేంద్రాలకు బ్యాలెట్‌యూనిట్లు, కం ట్రోల్‌ యూనిట్లు, వీవీప్యాట్లు కేటాయించా మని తెలిపారు. అత్యవసర సేవలు అంది స్తున్న వారు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అవకాశం కల్పించామన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు రాలేని 85సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు హోం ఓటింగ్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలి పారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో ప్రసాద్‌, ఏఈ బద్రుద్దీన్‌, తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:07 PM