Share News

Kumaram Bheem Asifabad: పోలింగ్‌ కోసం సిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:10 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 24: లోక్‌సభ ఎన్నిక లలో భాగంగా మే13న జరుగనున్న పోలింగ్‌ కోసం అన్నిఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి అన్నిజిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, అదనపుకలెక్టర్‌లు, ఆర్‌డీవోలు, మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు.

Kumaram Bheem Asifabad: పోలింగ్‌ కోసం సిద్ధంగా ఉండాలి

- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 24: లోక్‌సభ ఎన్నిక లలో భాగంగా మే13న జరుగనున్న పోలింగ్‌ కోసం అన్నిఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి అన్నిజిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, అదనపుకలెక్టర్‌లు, ఆర్‌డీవోలు, మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో భాగం గా పోలింగ్‌రోజున పూర్తి స్థాయిలో ఓటింగ్‌ జరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలలో పూర్తిస్థాయిలో మౌలిక సదు పాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ చేపట్టాలని, రాజకీయపార్టీలకు ముందస్తుగా సమాచారం అందించాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీలు నియమించిన పోలింగ్‌ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో బూత్‌ స్థాయి అధికారులు ఓటరుస్లిప్‌లు పంపిణీ చేసే సమయంలో పాల్గొనవచ్చన్నారు. ఓటర్‌స్లిప్‌లు పంపిణీ పారదర్శకంగా జరగా లన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ప్రత్యేకబృందాలను నియమించామ న్నారు.

పోలింగ్‌ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధంగా ఉన్నామన్నారు. పార్లమెంట్‌ పరిధి లోని సిర్పూర్‌, అసెంబ్లీనియో జకవర్గాల్లో పోలింగ్‌కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామ న్నారు. సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చర్యల్లో భాగంగా ఫారం 12 దరఖా స్తులను స్వీకరించామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, దాసవి వేణు, డీఆర్‌ఓ లోకేశ్వర్‌రావు, తహసీల్దార్‌లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:10 PM