Share News

Kumaram Bheem Asifabad: ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం వీడాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:12 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 24: ఉపాధిహామీపనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, పకడ్బం దీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు. బుధవారం కలెక్ట రేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Kumaram Bheem Asifabad:  ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం వీడాలి

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 24: ఉపాధిహామీపనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, పకడ్బం దీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు. బుధవారం కలెక్ట రేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధిహామీ పనుల్లో కూలీలసంఖ్య తగ్గడంపై వివరణ కోరారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నవారిపై వెంటనేచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ సిబ్బందికి పనులపై సృష్టమైన అవ గాహన ఉండాలన్నారు. గ్రామఅవసరాల మేరకు పనులపై తీర్మానం చేయాల న్నారు. అర్హులైన కూలీలందరికీ పనికల్పించాలని సూచించారు. కూలీలహాజరు మొబై ల్‌యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. సకాలంలో వేతనాలు చెల్లిం చాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది సమన్వ యంతో వెళ్తేనే ఫలితాలు బాగుంటాయన్నారు. వేసవిదృష్ట్యా పనిప్రదేశాల్లో తాగునీరు, నీడతోపాటు అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందు బాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీడీవోలు, కార్యదర్శులు, ఈజీఎస్‌ ఎఫ్‌ఏలు, టీఏలు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:12 PM