Share News

Kumaram Bheem Asifabad : ఇంటర్‌లో తగ్గిన ఉత్తీర్ణత

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:16 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 24: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్‌ మీడియట్‌ ఫలితాలు జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త నిరాశపరిచాయి. ఫస్టియర్‌ జనరల్‌ విభాగంలో 2097 మంది బాలురు పరీక్షలకు హజరు కాగా ఇందులో 982 మంది ఉత్తీర్ణత సాధించగా 46.83శాతం ఉత్తీర్ణత నమోదైంది.

 Kumaram Bheem Asifabad :  ఇంటర్‌లో తగ్గిన ఉత్తీర్ణత

- జిల్లాకు నిరాశ

- రాష్ట్రంలో ఎనిమిదవ స్థానం

- ఫలితాల్లో బాలికలదే పైచేయి

- ఫస్టియర్‌ ఫలితాల్లో రాష్ట్రంలో 8వ స్థానం

- సెకండియర్‌ ఫలితాల్లో రాష్ట్రంలో 7వ స్థానం

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 24: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్‌ మీడియట్‌ ఫలితాలు జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త నిరాశపరిచాయి. ఫస్టియర్‌ జనరల్‌ విభాగంలో 2097 మంది బాలురు పరీక్షలకు హజరు కాగా ఇందులో 982 మంది ఉత్తీర్ణత సాధించగా 46.83శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే 2473మంది బాలికలు పరీక్షలు రాయగా 1831మంది ఉత్తీర్ణత సాధించగా 74.04శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం మొదటి సంవత్సరం పరీక్షలకు 4570 మంది పరీక్షలు రాయగా 2813 మంది ఉత్తీర్ణత సాధించడంతో 61.55 శాతం నమోదై రాష్ట్రంలో 8వస్థానాన్ని జిల్లా కైవసం చేసుకుంది. అలాగే సెకండియర్‌ జనరల్‌ విభాగంలో 1929మంది బాలురు పరీక్షలు రాయగా 1176 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 60.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2166మంది బాలికలు పరీక్షలు రాయగా ఇందులో 1775మంది ఉత్తీర్ణత పొందగా 81.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 4095 మంది పరీక్షలు రాయగా ఇందులో 2951మంది ఉత్తీర్ణత పొందగా 72.06 ఉత్తీర్ణత శాతం నమోదైంది. దీంతో జిల్లా సెకండీయర్‌ ఫలితాల్లో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో ఈ ఏడాది బాలికలే పైచేయి సాధించారు. అదే విధంగా ఒకేషనల్‌ విభాగంలో ప్రథమ సంవత్సరంలో మొత్తం 853 మంది పరీక్షలు రాయగా 480 మంది ఉత్తీర్ణత పొంది 56.27 ఉత్తీర్ణత శాతం సాధించారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 662 మంది పరీక్షలు రాయగా 526 మంది ఉత్తీర్ణత సాధించడంతో 79.46 ఉత్తీర్ణత శాతం నమోదైంది.

సత్తాచాటిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు..

ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సత్తచాటారు. గన్నారం మహాత్మా జ్యోతిబా ఫూలే కళాశాల విద్యార్థిని హేమదేవి 984మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. అలాగే జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలకు చెందిన విద్యార్థినులు పూజిత, ఆక్షయ 983 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ

బెజ్జూరు, ఏప్రిల్‌ 24: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మండలవిద్యార్థులు ప్రతిభ చాటారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కేజీబీవీ ద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ప్రభుత్వ కళాశాలలో 131మంది పరీక్ష రాయగా 93మంది 71శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయసంవత్సరంలో 120మంది విద్యార్థులకు గాను 105మంది విద్యార్థులు 85 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే కేజీబీవీలో సీఈసీ మొదటి సంవత్సరంలో 16మందికి 11మంది ఉత్తీర్ణత సాధించగా ఎంపీహెచ్‌డబ్ల్యూలో 36మందికి 23మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో సీఈసీలో 13మందికి 13మంది ఉతీర్ణత సాధించగా ఎంపీహెచ్‌డబ్ల్యూవోలో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో రాచకొండ అక్షిత 462/470 మార్కులు సాధించింది. అలాగే ద్వితీయ సంవత్సరంలో బుజాడి ఉదయ్‌ కిరణ్‌ 904/1000 మార్కులు సాధించి మండల టాపర్‌లుగా నిలిచారు.

చింతలమానేపల్లి: మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠ శాల విద్యార్థులు 73శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 40మందికి 33మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 54మందికిగాను 36మంది సాధిం చారు. ద్వితీయసంవత్సరంలో కె.అనూష (ఎంపీసీ) 879/1000, అర్చన(ఎంపీసీ) 871/1000 మార్కులు సాధించారు. శాలిని(బైపీసీ) 934/1000, స్వాతి(బైపీసీ) 909/1000 మార్కులు సాధించారు.

దహెగాం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయసంవత్సరం 85శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రథమసంవత్సరం విద్యార్థులు 80 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ మహేందర్‌ బుధ వారం తెలిపారు. కళాశాలకు చెందిన విద్యార్థిని అంజలి (బైపిసీ) 924/1000మార్కులు సాధించగా, దెబ్బటి హరి కృష్ణ(సీఈసీ) 862/1000, పాలె అంజలి(బైపీసీ) 368/480, రాణి (సీఈసీ) 378/480, కేజీబీవీలో 77శాతం ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 99శాతం ఉత్తీర్ణత సాధించారు.

సిర్పూర్‌(టి): సాంఘిక సంక్షేమ బాలికల, కాగజ్‌నగర్‌ గురుకుల కళాశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీసీవో బాలరాజ్‌ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

జైనూర్‌: మండలంలో ఇంటర్మీడియట్‌ దితీయ సంవత్సరం పరీక్షలో 95శాతం ఫలితాలు సాధించామని ప్రభుత్వ జునీయర్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ శ్రీదేవి బుధవారం తెలిపారు. మొదటి సంవత్సరంలో 89శాతం ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. కాలేజీ టాపర్లుగా సాయినాథ్‌ 440కి గాను 430 మార్కులు, అనిత 470 మార్కులకు 448, ఆర్తి 470కి గాను 430, అస్మీత 470కి 417, పూజ1000 మార్కులకు 930, అభిలాష 1000 మార్కులకు 913మార్కులు సాధించారు.

కెరమెరి: మండలంలోని మోడి కేజీబీవీ కళాశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో మనుకుమార్‌ తెలిపారు. మొదటి సంవత్సరంలో రుక్మిణి 409/440, రేణుక 403/470 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో శ్రీలత 912/1000, సరిత 898/1000 మార్కులు సాదించి నట్లు తెలిపారు. జూనియర్‌కళాశాలలో ద్వితీయ సంవత్స రంలో 112మందికి 106మంది, మొదటి సంవత్సరంలో 104మందికి 68మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.

వాంకిడి: మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఫలితాల్లో మంచి ప్రతిభ కనబర్చారు. ద్వితీయ సంవత్సరం 162మందికి 159మంది 98.14శాతం ఉత్తీర్ణత సాధించగా మొదటి సంవత్సరంలో 160మందికి 130మంది 81.25శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయసంవత్సరంలో కె సాక్షిత్‌కుమార్‌ 964/1000, అర్జున్‌961/1000, సందేశ్‌909/1000, ఇందుమతి 862/1000, మొదటి సంవత్సరంలో సుచరిత 440/470, స్వప్న 438/470, సోనుప్రీత్‌ 415/440, వైష్ణవి414/440 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.

సిర్పూర్‌(యు): ఇంటర్మీడియట్‌ ఫలితాలు మోడల్‌ కాలేజి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్మీడి యట్‌ ద్వితీయసంవత్సరంలో మండల కేంద్రానికి చెందిన కాంబ్లే ఆర్తి బైపిసి సెకండ్‌ ఇయర్‌లో 1000 మార్కులకు గాను 955మార్కులు సాధించి కాలేజి టాపర్‌ గా నిలిచింది. అదేవిధంగా మోడల్‌ కాలేజీలో 149మంది విద్యార్థులుండగా అందులో 139మంది 93శాతం ఉత్తీర్ణత సాధించారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 40శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ప్రిన్సిపాల్‌ తిరుపతి తెలిపారు. ఎం వినయ్‌ 935/1000, అర్చన 912/1000 ఎటి విభాగంలో టాపర్లుగా నిలిచినట్టు ప్రకటించారు. కెజీబీవీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 71శాతం, మొదటి సంవత్సరంలో 62శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు ప్రిన్సిపాల్‌ రమాదేవి ప్రకటించారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ ఐశ్వర్యకు 963/1000, బీపీసీ అక్షితకు 881/1000 టాపర్లుగా రాణించినట్టు ప్రకటించారు.

Updated Date - Apr 24 , 2024 | 11:16 PM