Share News

Kumaram Bheem Asifabad: పాఠశాలల పనులను సకాలంలో పూర్తిచేయాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:14 PM

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 24: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని జక్కాపూర్‌, మాకిడి పాఠశాలల్లో చేపడుతున్న పనులను అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి పరిశీ లించారు.

Kumaram Bheem Asifabad:  పాఠశాలల పనులను సకాలంలో పూర్తిచేయాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 24: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని జక్కాపూర్‌, మాకిడి పాఠశాలల్లో చేపడుతున్న పనులను అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి పరిశీ లించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై డీఈ రాజ్‌కుమార్‌ను అడిగితెలుసుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మే13న జరగనున్న నేప థ్యంలో ఆలోపు పనులను పూర్తి చేయాలన్నారు. అలాగే పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి కేంద్రాల్లో అన్నిరకాలవసతులు ఉండేలా చూసుకోవాలని తహసీల్దార్‌ శ్రీనివాస్‌కు సూచిం చారు. వృద్ధులకు, వికలాంగుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయా లన్నారు. అలాగే సరిహద్దులో మహారాష్ట్ర రోడ్డుపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీచేశారు. అక్రమ మద్యం, నగదు తరలింపు దృష్టి పెట్టాల న్నారు. ఆయనవెంట తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో కృష్ణమూర్తి, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌, ఐటీడీఏ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు.

కాగజ్‌నగర్‌: అమ్మ ఆదర్శ పాఠశాలలను బుధవారం జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో ఎంపికైన పాఠశాలల్లో సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, కమిషనర్‌ అంజయ్య, సిబ్బందిఉన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:14 PM