Share News

Kumaram Bhim Asifabad: దేశం కోసం బీజేపీ ఏం చేసింది?: మంత్రి సీతక్క

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:12 PM

బెజ్జూరు, ఏప్రిల్‌ 27: దేశానికి చేసింది, చేసేది చెప్ప లేక రాజకీయాలకోసం బీజేపీ దేవున్ని వాడుకుంటున్న దని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం బెజ్జూరు మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు.

Kumaram Bhim Asifabad:  దేశం కోసం బీజేపీ ఏం చేసింది?: మంత్రి సీతక్క

- బీజేపీ వాళ్లు దేశ భక్తులు మేం దేశ ద్రోహులమా?

- దేశం కోసం పాటుపడ్డది ఇందిరమ్మ కుటుంబమే

- రూ.7లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్‌

- పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క

బెజ్జూరు, ఏప్రిల్‌ 27: దేశానికి చేసింది, చేసేది చెప్ప లేక రాజకీయాలకోసం బీజేపీ దేవున్ని వాడుకుంటున్న దని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం బెజ్జూరు మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. దేవుడి పేరుతో రాజకీయం చేసి దేవున్ని రోడ్ల మీదకు తెచ్చిన బీజేపీ వాళ్లు దేశభక్తులు, దేశం కోసం పాటు పడిన ఇందిరమ్మ కుటుంబం మాత్రం దేశ ద్రోహుల య్యారా అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే 2కోట్ల ఉద్యో గాలు కల్పించడంతోపాటు నల్లధనం బయటకు తీసి కుటుంబానికి రూ.15లక్షలు ఇస్తామని మోసం చేసిం దన్నారు. ట్యాక్స్‌ టెర్రరిజం పేరుతో బీజేపీ పెద్ద కుట్ర చేస్తోందని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే దేశంలో రేషన్‌,విద్య, ప్రాజెక్టులు, రేషన్‌కార్డులు, ఇతరపథకాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వల సలు నివారించి పేదల కోసం ఉపాధిహామీ పథకాన్ని తెచ్చి 100రోజుల పనికల్పించామని, కానీ అధికారం లోకి వచ్చిన తర్వాత బీజేపీ 40రోజులకు తగ్గించి కూలీలను మోసం చేసిందన్నారు. ఆదివాసీ మహిళ ఆత్రం సుగుణను ఆదిలాబాద్‌ ఎంపీగా గెలిపించాలని కోరారు. ఆదివాసీమహిళ ఎంపీగా ఉంటే పార్లమెంటు లో తనగొంతు వినిపించి ఈప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని అన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మాట్లాడుతూ ఆదివాసీ పేదిం టి మహిళగా తనను ఒక్కసారి ఆశీర్వ దించాలని, ఈ ప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం సిర్పూర్‌ ఇన్‌చార్జీ రావిశ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ వచ్చేనెల 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి పట్టంకట్టాలని కోరారు. ఆది వాసీ మహిళను గెలిపిస్తే అందుబాటు లో ఉండి సేవ చేస్తుందన్నారు. అనంతరం వివిధ పార్టీల నుంచి మంత్రి సీతక్క సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మాజీజడ్పీచైర్మన్‌ సిడాం గణపతి, ఎంపీపీలు డోకె రోజారమణి, డుబ్బుల నానయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్ధన్‌, మండల అధ్యక్షుడు శంకర్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ ఓంప్రకాష్‌, నాయకులు జగ్గాగౌడ్‌, వెంకన్న, సతీష్‌, నాహీర్‌ అలీ, నరేందర్‌ గౌడ్‌, మహేష్‌, జాహీద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

సత్రాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌లో మాజీఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రాన్ని శనివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా అన్నదానం చేస్తున్న తీరుతెన్నులపై కోనేరు కోనప్పను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నదానంలో పాల్గొని పలువురికి అన్నం వడ్డించారు. ఆమెవెంట కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి, సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలి

పెంచికలపేట: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ పార్ల మెంట్‌ సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఆరుగ్యారంటీల పథకం అమలు చేస్తున్నామన్నారు. చేతి గుర్తుకు ఓటేసి సుగుణక్కను గెలిపించాలని అన్నారు. అటవీ గ్రామాల రోడ్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. బీజేపీ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు వాటిని విశ్వసించరని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగం ఉండ కూడదని కుట్రలో భాగంగా రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అదిలాబాద్‌ జిల్లాలో ఏ పార్టీ కూడా గిరిజన ఆడబిడ్డకు ఎంపీగా అవకాశం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విద్యావంతురాలైన ఆత్రం సుగుణకు అవకాశం ఇచ్చిందన్నారు. ప్రతీ ఒక్కరూ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్‌, మాజీకేంద్ర మంత్రి వేణుగోపాలచారి, మాజీఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా ఇంచార్టీ జడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మాజీ జడ్పీ చైర్మన్‌ సిడాం గణపతి, కోఆప్షన్‌ సభ్యుడు సిద్దిక్‌, జడ్పిటీసీ సముద్రాల సరిత, పెంచికలపేట, దహెగాం మండలాల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:12 PM