Share News

ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న అధికారులు

ABN , Publish Date - Apr 23 , 2024 | 10:51 PM

మందమర్రిలో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, భూ కబ్జాదా రులు ఆదివాసీ హక్కులను కాలరాస్తున్నారని తు డుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిందర్‌ ఆరోపిం చారు.

ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న అధికారులు

మందమర్రి టౌన్‌, ఏప్రిల్‌ 23: మందమర్రిలో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, భూ కబ్జాదా రులు ఆదివాసీ హక్కులను కాలరాస్తున్నారని తు డుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిందర్‌ ఆరోపిం చారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 117 చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారన్నారు. ఇక్కడ గిరిజన భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నం. 385లో గల భూమిని కొందరు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రియల్‌ వ్యాపారులు గిరిజన భూములను ఆధారంగా చేసుకొని కోట్లకు పడగలె త్తార ని, కాని భూమి హక్కుదారులకు ప్రయోజ నం లేకుండా పోయిందన్నారు. అధికారులు గిరిజ నుల చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని భూముల హక్కు దారులకు న్యాయం చేయాలన్నారు. సత్యనారాయణ, వెంకటి, రాంబాబు, రాజే శ్వర్‌రెడ్డి, కూన తిరుపతి, కూన గోపాల్‌లు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 10:51 PM