Share News

జిల్లాలో తగ్గిన భూ క్రయ విక్రయాలు

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:15 PM

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రభావం చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల సం దర్భంగా కోడ్‌ అమల్లో ఉండటంతో దాదాపు రెండు నెలల పాటు రిజి స్ట్రేషన్లు అరకొరగా జరగగా, ప్రస్తుతం పార్లమెంట్‌ ఎలక్షన్ల సమయం లోనూ అదే పరిస్థితి నెలకొంది. నగదు లావాదేవీలపై ఆధారపడ్డ రియల్‌ రంగంలో ప్రస్తుతం భూముల క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోగా, వినియోగదారులు లేక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతు న్నాయి.

జిల్లాలో తగ్గిన భూ క్రయ విక్రయాలు

మంచిర్యాల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రభావం చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల సం దర్భంగా కోడ్‌ అమల్లో ఉండటంతో దాదాపు రెండు నెలల పాటు రిజి స్ట్రేషన్లు అరకొరగా జరగగా, ప్రస్తుతం పార్లమెంట్‌ ఎలక్షన్ల సమయం లోనూ అదే పరిస్థితి నెలకొంది. నగదు లావాదేవీలపై ఆధారపడ్డ రియల్‌ రంగంలో ప్రస్తుతం భూముల క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోగా, వినియోగదారులు లేక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతు న్నాయి. ఎలక్షన్‌ కోడ్‌ రాక ముందు నిత్యం వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు కాగా, కోడ్‌ అమల్లోకి వచ్చిన తరువాత ఒక్కసారిగా పడిపోయింది. భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కాగా, ఆంక్షల కారణంగా వాటిని తీసుకెళ్లడం కష్టసాధ్యంగా మారింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అధికంగా డబ్బుల వినియోగం జరుగుతుండగా, ఎక్కడ కూడా ఆధారాలు ఉండే అవకాశమే లేదు. దీంతో నగదు తరలించే సమయంలో పోలీసులకు దొరికితే సీజ్‌ అయ్యే అవకా శం ఉండటంతో భూముల క్రయ, విక్రయాల జోలికి వెళ్లడంలేదు.

తగ్గిన డాక్యుమెంటేషన్‌...

ఎలక్షన్‌ కోడ్‌ కారణంగా జిల్లాలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో డాక్యుమెం టేషన్‌ ప్రక్రియ గణనీయంగా పడిపోయింది. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగా, జూన్‌ 4తో ముగుస్తోంది. కోడ్‌ అమల్లోకి రాక ముం దు సగటున నిత్యం వందకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగగా, ప్రస్తుతం వాటి సంఖ్య సగానికి పడిపోయింది. మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మార్చి నెలలో మొత్తం 1587 రిజిస్ట్రేషన్లు జరుగగా, రూ.4 కోట్ల 73 వేల ఆదాయం సమకూరింది. లక్షెట్టిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 319 డాక్యుమెంటేషన్లు జరుగగా, రూ.53 లక్షల 68వేల ఆదాయం సమకూరిం ది. ఏప్రిల్‌ మాసంలో శనివారం నాటికి మంచిర్యాల కార్యాలయంలో మొత్తం 1100 రిజిస్ట్రేషన్లు జరుగగా రూ.3.56 కోట్ల ఆదాయం వచ్చింది. లక్షెట్టిపేట కార్యాలయంలో 253 డాక్యుమెంట్లు జరుగగా రూ.42 లక్షల 6వేల ఆదాయం మాత్రమే సమకూరింది. ఎలక్షన్‌ కోడ్‌ కారణంగా మంచిర్యాలలో రూ. కోటి పైచిలుకు ఆదాయం, లక్షెట్టిపేటలో రూ. 10 లక్షల ప్రభుత్వ ఆదాయం తగ్గింది

రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గింది....మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ బాల్‌కిషన్‌

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భూముల రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. నగదు తరలింపులపై ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలు ఉండటంతో భూముల క్రయ, విక్రయాలకు ప్రజలు ముందుకు రావడం లేదు. కేవలం ఒక నెలలోనే ప్రభుత్వ ఆదాయంలో గణనీయమైన తేడా కనిపిస్తోంది. మరికొద్ది రోజులు కూడా పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉంది.

ఏడాది మొత్తం పోయినట్లే....

వూడెం వెంకటస్వామి, రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో బిజినెస్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోడ్‌ కారణంగా క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్రంలో లే అవుట్‌ లేని వెం చర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనోపాది పొందుతు న్నాయి. ఎన్నికలు ముగిసిన తరువాత ప్రభుత్వం సింగిల్‌ విండో విధానం ప్రవేశపెట్టి ప్రత్యేక రుసుం వసూలు ద్వారా ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Updated Date - Apr 27 , 2024 | 11:15 PM