Share News

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్‌ఎస్‌ పార్టీయే

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:14 PM

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్‌ఎస్‌ మాత్ర మేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద శనివారం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌ రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి బాల్క సుమన్‌ జెండా ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లా డుతూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా ల్లో కొత్త పుంతలు తొక్కి దేశానికే బీఆర్‌ఎస్‌ పార్టీ దిశానిర్ధేశంగా నిలిచిందన్నారు.

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్‌ఎస్‌ పార్టీయే

నస్పూర్‌, ఏప్రిల్‌ 27: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్‌ఎస్‌ మాత్ర మేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద శనివారం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌ రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి బాల్క సుమన్‌ జెండా ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లా డుతూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా ల్లో కొత్త పుంతలు తొక్కి దేశానికే బీఆర్‌ఎస్‌ పార్టీ దిశానిర్ధేశంగా నిలిచిందన్నారు. ప్రస్త్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్యకర్తలు, నేతలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయా లన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఏమీ చేశా యని, ఈ రెండు పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలని సుమన్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి మోసంతో గద్దెనెక్కిం దన్నారు. కుటుంబ పా లన అని విమర్శలు చే సిన వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా అదే కుటుంబానికి పెద్ద పల్లి ఎంపీ అభ్యర్థిని కూడా నిలబెడితే అది కుటుంబ పాలన కాదని ఎద్దెవా చేశారు. దళిత బిడ్డకు, ధనిక బిడ్డకు మధ్య పెద్దపల్లిలో పోటీ నెలకొందన్నారు. నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, అక్కూరి సుబ్బయ్య, పవన్‌ కుమార్‌, రఫీక్‌, సురేందర్‌ రెడ్డి, బానుచందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:14 PM