Share News

Rain Alert: తెలంగాణలో 5 రోజులు వర్షాలు...ఎన్నికల రోజున కూడా..

ABN , Publish Date - May 09 , 2024 | 09:04 AM

తెలంగాణ(telangana)లో 5 రోజులు మోస్తరు వర్షాలు(rains) కురుస్తాయని హైదరాబాద్(hyderabad) వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు విదర్భ, మహారాష్ట్ర, తమిళనాడులలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

 Rain Alert: తెలంగాణలో 5 రోజులు వర్షాలు...ఎన్నికల రోజున కూడా..
Rain in Telangana 5 days

తెలంగాణ(telangana)లో 5 రోజులు మోస్తరు వర్షాలు(rains) కురుస్తాయని హైదరాబాద్(hyderabad) వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు విదర్భ, మహారాష్ట్ర, తమిళనాడులలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేటితోపాటు ఐదు రోజులు వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని వెదర్ రిపోర్ట్ చెప్పింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్(yellow alert) కూడా జారీ చేసింది.


మరోవైపు ఎన్నికలు జరగనున్న మే 13న కూడా తెలంగాణ, ఏపీలో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ పేర్కొంది. ఇక పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్(orage alert) ప్రకటించారు. అల్పపీడనం కొనసాగుతుందని మే 12 వరకు పలుచోట్ల వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.


ఉక్కపోత నుంచి ఉపశమనం పొందే క్రమంలో రంగారెడ్డి, భోంగీర్, మల్కాజిగిరి, జనగాం, నల్గొండ, సూర్యాపేట సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షం కురిసింది. పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మార్కెట్‌ యార్డులో వేసిన పంటలు ఎక్కడికక్కడ తడిసిపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Loksabha Polls 2024: నేడు తెలంగాణకి రానున్న రాహుల్ గాంధీ


KCR : చిన్నపాటి వానకే పది గంటలు కరెంట్‌ పోతదా?

Read more Telangana News and Telugu News

Updated Date - May 09 , 2024 | 09:06 AM