Share News

ఉద్యోగులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:01 AM

సింగరేణిని కాపాడడం కోసం ఉద్యో గులు నడుం బిగించాలని టీబీజీకేఎస్‌ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ మిర్యా ల రాజిరెడ్డి పిలుపునిచ్చారు.

ఉద్యోగులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలి

గోదావరిఖని, ఏప్రిల్‌ 24: సింగరేణిని కాపాడడం కోసం ఉద్యో గులు నడుం బిగించాలని టీబీజీకేఎస్‌ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ మిర్యా ల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన టీబీజీకేఎస్‌ రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 134సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కోసం అనేక మంది అసువులు బాసారని చెప్పారు. సింగరేణి సంస్థ వినియోగించే యం త్ర సామాగ్రి, పనిముట్లను తయారు చేసే పరిశ్రమలను నెలకొల్పే విధంగా కోల్‌బెల్ట్‌ ఏరియా యువతను సింగరేణి యాజమాన్యం ప్రోత్సహిం చాలని, సింగరేణి సంస్థ కార్మికులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం కోసం కార్పొరేట్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా కార్మికులకు సింగరేణి యాజమాన్యం కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికవాడల్లో కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారని, ఇప్పటికైనా వారికి మంచినీటిని అందించాలని డిమాండ్‌ చేశారు. 14అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ ప్రారంభం ముందు టీబీజీకేఎస్‌ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన 13మంది యూనియన్‌ ప్రతినిధులకు నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో నూనె కొమురయ్య, మాదాసు రామమూర్తి, పర్లపల్లి రవి, శ్రీని వాసరావు, సంపత్‌, వడ్డేపల్లి శంకర్‌, ఐలి శ్రీనివాస్‌, పెట్టెం లక్ష్మణ్‌, సమ్మ య్య, వీరభద్రం, బడికెల సంపత్‌, జాహెద్‌పాషా, కాపు కృష్ణ, వెంకటేష్‌, సాంబయ్య, రవీందర్‌, చల్లా రవీందర్‌రెడ్డి, చెల్పూరి సతీష్‌, రమేష్‌, అవి నాష్‌, శేషగిరి పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:01 AM