Share News

బాలికలదే హవా

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:21 AM

ఎప్పటిలాగే ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనసాగింది. జనరల్‌, ఒకేషనల్‌ రెండు కోర్సుల్లోనూ బాలికలు సత్తాచాటారు. బుధవారం వెల్లడైన ఫలితాల్లో జిల్లా ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి సంవత్సరం 13వ స్థానంలో, రెండో సంవత్సరంలో 16వ స్థానంలో నిలిచింది.

  బాలికలదే హవా

- ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ

- జిల్లాలో 65.5 శాతం ఉత్తీర్ణత

- మొదటి సంవత్సరం 57.79 శాతం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఎప్పటిలాగే ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనసాగింది. జనరల్‌, ఒకేషనల్‌ రెండు కోర్సుల్లోనూ బాలికలు సత్తాచాటారు. బుధవారం వెల్లడైన ఫలితాల్లో జిల్లా ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి సంవత్సరం 13వ స్థానంలో, రెండో సంవత్సరంలో 16వ స్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరం జనరల్‌ ఇంటర్‌లో 57.79 శాతం, ఒకేషనల్‌లో 47.73 శాతం రెండో సంవత్సరంలో జనరల్‌ ఇంటర్‌లో 65.5 శాతం, ఒకేషనల్‌లో 63.1 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండు సంవత్సరాలు కలిపి 6722 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 4130 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 902 మంది పరీక్షలకు హాజరవగా 498 మంది ఉత్తీర్ణులయ్యారు. 2019లో మొదటి సంవత్సరంలో 50 శాతం, 2020లో 51 శాతం, 2021లో 37 శాతం, 2022లో 60 శాతం, 2023లో 57 శాతం, ప్రస్తుత 2024లో 57.79 సాధించారు. రెండో సంవత్సరం ఫలితాల్లో 2019లో 61 శాతం, 2020లో 63 శాతం, 2021లో వంద శాతం, 2022లో 64 శాతం, 2023లో 69 శాతం, ప్రస్తుత 2024లో 65.5 శాతం ఉత్తీర్ణత సాధించారు.

1740 మంది బాలికలే అధికం

జిల్లాలో ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే భేష్‌ అనిపించుకున్నారు. మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో 6722 మంది విద్యార్థులకు 4,130 మంది ఉత్తీర్ణులయ్యారు. 2592 మంది ఫెయిలయ్యారు. బాలురు 1195 మంది, బాలికలు 2935 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో అధికంగా బాలికలు 1740 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 3542 మంది విద్యార్థులకు 2047 మంది ఉత్తీర్ణులయ్యారు. 1495 మంది ఫెయిలయ్యారు. 57.79 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురులో 1331 మంది పరీక్షలకు హాజరవగా 599 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2211 మంది హాజరవగా 1448 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే 849 మంది బాలికలే అధికంగా ఉన్నారు. రెండో సంవత్సరంలో 3180 మంది పరీక్షలకు హాజరవగా 2083 మంది ఉత్తీర్ణులయ్యారు. 65.5 శాతంగా ఉండగా 1097 మంది ఫెయిలయ్యారు. బాలురు 1154 మంది హాజరవగా 596 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2026 మంది హాజరవగా 1487 మంది ఉత్తీర్ణులయ్యారు. 891 మంది బాలికలు అధికంగా ఉన్నారు.

ఒకేషనల్‌లో 498 మంది ఉత్తీర్ణత

జిల్లాలో ఇంటర్‌ ఒకేషనల్‌లో 902 మంది పరీక్షలకు విద్యార్థులు హాజరవగా 498 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 404 మంది ఫెయిలయ్యారు. మొదటి సంవత్సరంలో 463 మంది విద్యార్థులకు 221 మంది ఉత్తీర్ణులయ్యారు. 242 మంది ఫెయిలయ్యారు. ఉత్తీర్ణత 47.73 శాతంగా ఉంది. బాలురలో 272 మందికి 87 మంది, బాలికల్లో 191 మందికి 134 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం 439 మంది విద్యార్థులకు 277 మంది ఉత్తీర్ణులయ్యారు. 63.1 శాతం ఉత్తీర్ణత ఉంది. బాలురలో 235 మందికి 117 మంది, బాలికల్లో 204 మందికి 160 మంది ఉత్తీర్ణులయ్యారు.

గురుకులాల్లో భేష్‌

జిల్లాలో గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఆరు కేజీబీబీ పాఠశాలల్లో మొదటి సంవత్సరంలో 271 మంది విద్యార్థులకు 230 మంది ఉత్తీర్ణులయ్యారు. 85 శాతం ఉత్తీర్ణత ఉండగా రెండో సంవత్సరంలో 205 మందికి 174 మంది ఉత్తీర్ణులయ్యారు. కేజీబీవీ గంభీరావుపేటలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీల్లో ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో గంగాభవాని 987 మార్కులు, మర్రిపల్లిలో బైపీసీలో ఎంప ప్రసన్న 978, తంగళ్లపల్లి సీఈసీలో జి.వైష్ణవి 911, ఎంపీహెచ్‌ డబ్ల్యూలో పి.హాసిని 980 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కేజీబీవీ సిరిసిల్లలో బైపీసీలో కె.వైష్ణవి 433 మార్కులు, మర్రిపల్లిలో ఎంపీసీలో జి.హాస్విత 453, రుద్రంగి డి.హారిక 452, తంగళ్లపల్లి సీఈసీలో వై.అశ్విని 440, ఎంపీహెచ్‌ డబ్ల్యూలో సీహెచ్‌ రేష్మ 480 మార్కులు సాఽధించారు. మైనార్టీ రెసిడెన్షియల్‌లో ప్రథమ సంవత్సరంలో 17 మంది విద్యార్థులకు 15 మంది ఉత్తీర్ణులవగా ద్వితీయ సంవత్సరంలో 27 మందికి 25 మంది ఉత్తీర్ణులయ్యారు. తంగళ్లపల్లి గర్ల్స్‌ రెసిడెన్షియల్‌లో 93 శాతం ఉత్తీర్ణులవగా వేములవాడ బాలుర రెసిడెన్షియల్‌లో 79 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో ఎంఎల్‌టీలో 970మార్కులు, బైపీసీలో సీహెచ్‌ మీనాక్షి 973 మార్కులు, మొదటి సంవత్సరంలో ఎల్‌ఎం అండ్‌డీటీ 476 మార్కులు, బైపీసీలో జె.స్నేహా 430 మార్కులు సాధించారు.

రీకౌంటింగ్‌, రీ వెరిఫీకేషన్‌కు అవకాశం

- సీహెచ్‌ మోహన్‌, జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి

జిల్లాలో ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. మొదటి సంవత్సరంలో ఇంటర్‌ జనరల్‌లో 57.79 శాతం, రెండో సంవత్సరం 65.5 శాతం, ఒకేషనల్‌లో మొదటి సంవత్సరం 47.73 శాతం, రెండో సంవత్సరం 63.1 శాతం ఉత్తీర్ణులయ్యారు. గురువారం నుంచి మే 2వ తేదీ వరకు రీకౌంటింగ్‌, రీ వేరిఫికేషన్‌ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు ఫెయిలైన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమవుతాయి.

Updated Date - Apr 25 , 2024 | 01:21 AM