Share News

సస్పెన్షన్‌కు తెర

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:29 AM

కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. బుధవారం ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ రాజేందర్‌రావు అభ్యర్థిత్వంతోపాటు హైదరాబాద్‌, ఖమ్మం నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. రాజేందర్‌రావు ఈనెల 22న కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

సస్పెన్షన్‌కు తెర

28కెఎన్‌ఆర్‌24

--------------------------------------

- కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజేందర్‌రావు

- వీడిన చిక్కుముడి

- ఫలించిన మంత్రి పొన్నం ప్రయత్నాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. బుధవారం ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ రాజేందర్‌రావు అభ్యర్థిత్వంతోపాటు హైదరాబాద్‌, ఖమ్మం నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. రాజేందర్‌రావు ఈనెల 22న కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు నియోజకవర్గ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం పార్టీలో చర్చకు తెరతీసింది. పార్టీ నాయకత్వం అధికారికంగా అభ్యర్థిని ప్రకటించక ముందే పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడం మంత్రి, ఎమ్మెల్యేలు పాల్గొనడంపై అధిష్ఠానం సీరియస్‌గా ఉందని ప్రచారం జరిగింది. ఈ చర్చలన్నింటికి తెరదించుతూ ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేందర్‌రావు పేరును అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపించి టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, పార్టీ నాయకుడు రుద్ర సంతోష్‌కుమార్‌, తీన్మార్‌ మల్లన్నతో పోటీ పడ్డారు. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతున్న్నా పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాన్ని కొనసాగించారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి కరీంనగర్‌ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం పొందారు. ఈ ప్రయత్నంలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌, డీసీసీ అధ్యక్షుడు, శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్‌, పార్లమెంట్‌ నియోజక వర్గ పరిధిలోని నియోజక వర్గ ఇన్‌చార్జిలు వొడితెల ప్రణవ్‌, పురమల్ల శ్రీనివాస్‌, కేకే మహేందర్‌రెడ్డి ఆయనకు అండగా నిలిచారు.

రాజకీయ నేపథ్యం :

కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు తండ్రి వెలిచాల జగపతిరావు కరీంనగర్‌ శాసన సభ్యుడిగా పనిచేశారు. రాజేందర్‌రావు 1989లో గుండిగోపాల్‌రావుపేట సింగిల్‌ విండో చైర్మన్‌గా పనిచేశారు. 1991 నుంచి 1994 వరకు కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత రాజేందర్‌రావు ఆ పార్టీలో చేరి 2001 నుంచి 2004 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, యువజన వ్యవహారాలు, విద్యార్థి వ్యవహారాల ఇన్‌చార్జిగా పని చేశారు. 2004లో చొప్పదండి నియోజక వర్గ టికెట్‌ ఆశించారు. ఆయనకు పార్టీ బీఫారం అందించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ రాజేందర్‌రావును పోటీ చేయవద్దని కోరింది. పోటీ నుంచి తప్పుకోవడానికి నిరాకరించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 30 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి సినీ నటుడు చిరంజీవి నాయకత్వానికి మద్ధతు తెలిపారు. 2007 నుంచి 2009 వరకు ప్రజారాజ్యం పార్టీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో ఆపార్టీ అభ్యర్థిగా కరీంనగర్‌ లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేశారు. 1.76 లక్షల ఓట్లను సాధించి ఆయన మూడో స్థానంలో నిలిచారు.

Updated Date - Apr 25 , 2024 | 12:29 AM