Share News

ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలుచేస్తాం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:10 AM

ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలుచే స్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలుచేస్తాం

ముత్తారం ఏప్రిల్‌ 27: ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలుచే స్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. శనివారం మండలంలోని మచ్చుపేట గ్రామం బగుళ్ల కమాన్‌ దగ్గర ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ అడవిశ్రీరాంపూర్‌ నుంచి ఖమ్మంపల్లి వరకు రోడ్డు రూ.3కోట్ల నిధులు కేటాయించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు. 6 గ్యారంటీలకు నిదర్శనం ఉచిత బస్సు, సబ్సిడీపై గ్యాస్‌ కనబడతలేవా అన్నారు. కొంతమంది అభివృద్ధి ఏది అంటున్నారని, బగుళ్లరోడ్డు, సీసీరోడ్లు, 6 గ్యారంటీలలో మూడు గ్యా రంటీలు అమలుచేసింది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అభి వృద్ధి కార్యాచరణతో ముందుకుపోతున్నామని, కొంతమంది అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారని, వారి కళ్లకు కనిపించేందుకు అభివృద్ధి జరిగిన చోటే ఉండి మాట్లాడుతున్నానని అన్నారు.

ఎన్నికల తరువాత 70ఎంఎంలో అభివృద్ధి చూపిస్తాం..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలే అవుతోం దని, ఇప్పటివరకు అభివృద్ధిలో సంక్షేమ పథకాలలో 35 ఎంఎం ట్రయలర్‌ మాత్రమే చూపించామని, ఎంపీ ఎన్నికల తరువాత 70ఎంఎం అభివృద్ధి సినిమా చూపి స్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మచ్చుపేట నుంచి బైకు ర్యాలీతో మండల కేంద్రానికి చేరుకొని కాం గ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. అభివృద్ధి అం టున్నారు.. వారికి మంథని అభివృద్ధి అంటే ఏంటో 70 ఎంఎంలో చూపిస్తానని శ్రీధర్‌బాబు అన్నారు. మేడిగ డ్డ బ్యారేజీ మీద తాము అసత్య ప్రచారాలు చేస్తున్నా మని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శిస్తున్నారని, మేడిగడ్డ బ్యారేజీ అలా ఉంటే ఓడేడు మానేరు బ్రిడ్జి చిన్న ఈదు రు గాలికి కొట్టుకుపోయిందని అన్నారు. కేసీఆర్‌కు ద మ్ముంటే ముత్తారం మండలానికి వచ్చి చూడాలని, వారు చేసిన అవినీతి ఎలా ఉందో తెలుస్తుందన్నారు అనంతరం ఓడేడు మానేరు బ్రిడ్జిని పరిశీలించిన అనం తరం బాధ్యులపై కట్టిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆశీర్వదించి ఆదరించండి..

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి భారీ మెజారి టీతో గెలిపించాలని ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కోరారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి వంశీ మాట్లాడారు. తనను గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఎల్లవేళలా అండగా ఉండి వారి ఉపాధి కల్పనకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్‌, మండ ల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్‌మోహ న్‌రావు, కోఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ అల్లాడి యాదగిరిరావు, మాజీ సర్పంచులు తూటి రజితరఫీ, బక్కరావు, దొడ్డ గీతారాణి, బియ్యని శివకుమార్‌, ముస్కుల సురేందర్‌రెడ్డి శశిభూషణ్‌కాచే పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:10 AM