Share News

కనుల పండువగా బావోజీ రథోత్సవం

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:17 PM

త్తపల్లి మండలంలో వెల సిన గిరిజనుల ఆర్యాధ్య దైవమైన బావోజీ బ్రహ్మోత్స వాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి.

కనుల పండువగా బావోజీ రథోత్సవం

- భారీగా తరలివచ్చిన గిరిజనులు

- జనసంద్రమైన తిమ్మారెడ్డిపల్లి

మద్దూర్‌, ఏప్రిల్‌ 24 : కొత్తపల్లి మండలంలో వెల సిన గిరిజనుల ఆర్యాధ్య దైవమైన బావోజీ బ్రహ్మోత్స వాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందు లో భాగంగా బుధవారం తెల్లవారుజామున రథోత్స వం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అందంగా అలంకరించిన రథాన్ని బావోజీ ఆలయం నుంచి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వర కు లాగారు. ఈ సందర్భంగా లంబాడా గిరిజన సాం ప్రదాయం నృత్యాలు, భజనలు పలువురిని ఆకట్టుకు న్నాయి. తమ ఆరాధ్య దైవమైన బావోజీని దర్శించుకో వడానికి వచ్చిన భక్తులు ప్రత్యేక నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు బావో జీని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి దర్శిం చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు సాంప్రదాయ ప్రకారం వారిని సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీ సీ మాజీ సభ్యుడు ఎండీ సలీం, మద్దూర్‌, కొత్తపల్లి మండలాల అధ్యక్షుడు గోపాల్‌, మధుసూదన్‌రెడ్డి, నాయకులు వెంట్రాములుగౌడ్‌, శేఖర్‌ ఉన్నారు.

బావోజీని దర్శించుకున్న డీకే అరుణ

మండలంలోని గోకుల్‌నగర్‌, దుప్పడ్‌గట్టు, భూనీ డ్‌, నిడ్జింత గ్రామాల్లో బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పదేళ్ల మోదీ పాలనలో దేశం సాధించిన అభివృద్ధిని ప్రజల కు వివరించారు. అనంతరం తిమ్మారెడ్డిపల్లికి చేరుకు న్న డీకే అరుణ బావోజీని దర్శించుకున్నారు. ఈ సం దర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు.

Updated Date - Apr 24 , 2024 | 11:17 PM