Share News

సనాతన ధర్మానికి కట్టుబడిన పార్టీ బీజేపీ

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:04 PM

సనాతన ధర్మానికి కట్టుబడిన పార్టీ బీజేపి అని ఆ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూరావు నామాజీ అన్నారు

సనాతన ధర్మానికి కట్టుబడిన పార్టీ బీజేపీ
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణా సంఘం సభ్యుడు నాగూరావు నామాజి

- బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం సభ్యుడు నాగూరావు నామాజీ

నర్వ, ఏప్రిల్‌ 27 : సనాతన ధర్మానికి కట్టుబడిన పార్టీ బీజేపి అని ఆ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూరావు నామాజీ అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మికాంత్‌రెడ్డి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహ్మరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఊట్కూర్‌ భాస్కర్‌తో కలిసి మాట్లాడారు. పార్లమెంట్‌లో మన పాలమూరు గలం విప్పేందుకు డీకే అరుణను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డీకే అరుణపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాముడే లేడని సుప్రీంలో కేసు వేసిన కాంగ్రెస్‌కు దేశాన్ని శాశించే హక్కు లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి మాట్లాడుతూ ఈ సారి బీజేపీ గెలుపు ఖాయం అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కొండారెడ్డిపల్లెలో వారి కుటుంబీకుల చరిత్ర మాకు తెలుసు అన్నారు. డీకే అరుణ గెలిచిన వెంటనే పక్కా ఇండ్లతో పాటు పలు సంక్షేమ పథకాలను ఎంపీ నిధులతో మోదీ ప్రభుత్వం అందిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మికాంతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో సముచిత స్థానం, గౌరవం లభించక పోవడంతో నేను వీడినట్లు తెలిపారు. నా వెంట ఉన్న వారికి నా వంతు సహకారం అందిస్తూ బీజేపీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయా గ్రామాల కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పార్టీలో చేరగా వారికి డీకే భరత సింహారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్‌, కుర్వ సత్యం, నరేందర్‌రెడ్డి, బ్రహ్మనందరెడ్డి, రవికుమార్‌ రెడ్డి, ప్యాట వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్‌ రావ్‌, సుధాకర్‌ రెడ్డి, హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:04 PM