Share News

కారు, వ్యాను ఢీ - ఒకరి మృతి

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:26 PM

వెల్దండ సమీపంలో హైదరాబాద్‌ - శ్రీశైలం ప్రధాన రహదారిపై కేవీఆర్‌ ఫుడ్‌విలేజ్‌ సమీపంలో బుధవారం సాయంత్రం కారు, వ్యాను ఢీకొనడంతో కొట్ర గ్రామానికి చెందిన వసంతపు మహేష్‌ ( 28) అను వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

కారు, వ్యాను ఢీ - ఒకరి మృతి
మహేష్‌ (ఫైల్‌)

- పలువురికి గాయాలు

వెల్దండ, ఏప్రిల్‌ 24 : వెల్దండ సమీపంలో హైదరాబాద్‌ - శ్రీశైలం ప్రధాన రహదారిపై కేవీఆర్‌ ఫుడ్‌విలేజ్‌ సమీపంలో బుధవారం సాయంత్రం కారు, వ్యాను ఢీకొనడంతో కొట్ర గ్రామానికి చెందిన వసంతపు మహేష్‌ ( 28) అను వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.... మహేష్‌ స్విఫ్ట్‌కారులో వెల్దండ వైపు నుంచి కల్వకుర్తి వైపునకు వెళుతుండగా అచ్చంపేట నుంచి హైదరాబాద్‌లోని పటాన్‌చెరువులో జరిగే రిసెప్షన్‌ శుభకార్యానికి వెళుతున్న స్కూల్‌ వ్యాను ఢీకొంది. దీంతో కారు రోడ్డు ప్రక్కగా ఎగిరిపడి నుజ్జునుజ్జు కావడంతో మహేష్‌ కారులో ఇరుక్కుని అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా ప్రమాదంలో కారు పక్కగా వెళుతున్న మరో ఆటోను ఢీకొనగా అందులో ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో బస్సులో ఉన్న తిర్పతమ్మ, లక్ష్మమ్మ, తేజ, నిహారిక, లక్కిలను స్వల్ప గాయాలుకాగా వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు మహేష్‌కు భార్య మాధవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్‌ఐ రవి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపాడు. మహేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పలువురికి గాయాలు

లింగాల : నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల నుం చి అచ్చంపేటకు వెళ్లే మార్గంలోని సూరాపూర్‌ గేటు సమీ పంలో రెండు కార్లు ఢీకొని పలు వురికి స్వల్ప గాయా లయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట నుంచి కోమటికుంటకు, లింగాల నుంచి అచ్చంపేటకు వెళ్తున్న కార్లు ఎదురె దురుగా బలంగా ఢీ కొన్నాయి. ప్రమాదం లో ఓ కారు చెట్ల పొదల్లోకి వెళ్లి పల్టీ కొట్టగా, మరో కారు పూర్తిగా ధ్వంసమైం ది. ప్రమాద సమ యంలో ఆయా కార్ల లో ఎనిమిది మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నప్పటికి కార్లలో ఉన్న బె లూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. గాయాలకు గురైన వ్యక్తులను 108లో అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 24 , 2024 | 11:26 PM