Share News

ఉపాధి కూలి రోజుకు రూ.600 ఇవ్వాలి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:01 PM

ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు రోజుకు రూ.600 కూలి చెల్లించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం డిమాండ్‌ చేశారు.

ఉపాధి కూలి రోజుకు రూ.600 ఇవ్వాలి
కూలీలతో మాట్లాడుతున్న సలీం

- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం

ఊట్కూర్‌, ఏప్రిల్‌ 27 : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు రోజుకు రూ.600 కూలి చెల్లించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలోని బిజ్వార్‌ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కూలీలతో మాట్లాడారు. 45 డిగ్రీల మండుటెండలో ఉపాధి హామీ పథకం ద్వారా పని చేస్తున్న కూలీందరికీ తాగునీరు, నీడతో కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఓఆర్‌ఎస్‌, మెడికల్‌ కిట్లు, టెంట్లు, గడ్డపారలు ఇతర పనిముట్లు అందజేయాలన్నారు. ప్రతీ రోజు పని చేస్తున్నన కొలతల ప్రకారం రూ.80 నుంచి రూ.100 మాత్రమే కూలి పడటంతో గిట్టుబాటు కావడం లేదన్నారు. రోజుకు రూ.600 చెల్లించడంతో పాటు ఏడాది పొడవునా పని కల్పించాలన్నారు. ఉపాధి పనులు కల్పిస్తున్నా కూలి గిట్టుబాటు కాక హైదరాబాద్‌, బొంబాయి, బెంగళూరు, పూణె తదితర ప్రాంతాలను వలస వెళ్తున్నారన్నారు. పెద్దజట్రం గ్రామంలో ఇటీవల మృతి చెందిన వలస కూలీకి ఎలాంటి సాయం అందించలేదన్నారు. జాబ్‌ కార్డు ఉన్న ప్రతీ కూలీకి సహాజ మరణం కింద రూ.ఐదు లక్షలు, ప్రమాద బీమా కింద రూ.10 లక్షలు బీమా కల్పించాలన్నారు. గతంలో వేసవిలో పనిచేస్తే వేసమి అలవెన్స్‌ కూడా కలిపి చెల్లించే వారని, ఇప్పుడు చెల్లించడం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్‌, గ్రామ అధ్యక్షుడు లొడ్డ తిమ్మప్ప, నాయకులు పిరికి రాములు, గోలి తిమ్మప్ప, ఎల్లప్ప, ఫీల్‌ అసిస్టెంట్‌ ఆంజనేయులు, మేటి దాసరి పద్మ, తోక ఆంజనేయులు, చిన్న నర్సిములు, ఖయ్యూం, రమేష్‌, వెంకటయ్య, కూలీలు పాల్గొన్నారు.ర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:01 PM