Share News

బాలికలే ముందంజ

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:19 PM

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పై చేయిగా నిలిచింది.

బాలికలే ముందంజ
పరీక్షా ఫలితాలను చూసుకుంటున్న విద్యార్థులు

- ఇంటర్‌ ఫలితాల్లో ఫస్ట్‌ ఇయర్‌లో 44.3 శాతం ఉత్తీర్ణత

- సెకండ్‌ ఇయర్‌లో 53.81 శాతం

నారాయణపేట, ఏప్రిల్‌ 24 : ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పై చేయిగా నిలిచింది. జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 44.3 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 53.81 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో జనరల్‌ వి ద్యార్థులు బాలురు 1,635 మంది పరీక్షలు రాయగా, 482 మంది ఉత్తీర్ణులై 29.48 శాతానికి పరిమితమయ్యారు. బాలికలు 2,146 మంది పరీక్షలు రాయగా, 1,193 మంది ఉర్తీర్ణు లైన 55.29 శాతం సాధించారు. మొత్తం 3,781 మంది విద్యార్థులకు గాను 1,675 ఉత్తీరులు కా గా ఇంటర్‌ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత 44.3 శాతానికి పరిమితమైంది. ఒకేషనల్‌ విద్యార్థులు బాలురు 184 మంది పరీక్షలు రాయగా 89 మంది ఉత్తీర్ణులై, 48.37 శాతం సాధించారు. బాలికలు 393 మంది పరీక్షలు రాయగా 332 మంది ఉర్తీర్ణులై 84.48 శాతం సాధించారు. మొత్తం 577 మంది విద్యార్థులకు గాను 421 మంది ఉత్తీర్ణులు కాగా ఫస్ట్‌ ఇయర్‌ ఒకేషనల్‌ లో ఉత్తీర్ణత 72.96 శాతంగా నమోదైంది. ఇంట ర్‌ సెకండ్‌ ఇయర్‌ జనరల్‌ విద్యార్థులు బాలురు 1,435 మంది పరీక్షలు రాయగా, 573 మంది ఉత్తీర్ణులై 39.93 శాతానికి పరిమతమయ్యారు. బాలికలు 1,951 మంది పరీక్షలు రాయగా, 1,249 మంది ఉత్తీర్ణత సాధించగా, 64.02 శా తం సాధించారు. మొత్తం 3,386 మంది విద్యా ర్థులకు గాను 1,822 ఉత్తీర్ణులు కాగా ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఉత్తీర్ణత 53.91 శాతంగా నమో దైంది. ఒకేషనల్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు బాలురు 168 మంది పరీక్షలు రాయగా, 97 మంది ఉత్తీర్ణులై 57.74 శాతానికి పరిమితమ య్యారు. బాలికలు 374 మంది పరీక్షలు రాయగా, 339 మంది ఉత్తీర్ణులు కాగా, 90.64 శాతం సాధించారు. మొత్తం 542 మంది విద్యార్థులకు గాను 436 ఉత్తీర్ణులు కాగా, 88.44 శాతం ఓకే షనల్‌ సెకండ్‌ ఇయర్‌లో సాధించారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ప్రైవేట్‌ జనరల్‌ విద్యార్థులు బాలురు 403 మంది పరీక్షలు రాయగా, 82 మంది ఉత్తీర్ణులై 20.35 శాతం నమోదైంది. బాలికలు 184 మంది పరీక్షలు రాయగా, 57 మంది ఉర్తీర్ణులై 30.98 శాతం సాధించారు. మొత్తం 587 మంది విద్యార్థులకు గాను 139 మంది ఉత్తీర్ణులు కాగా 23.48 శాతం సెకండ్‌ ఇయర్‌ ప్రైవెట్‌ జనరల్‌ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఒకేషన్‌ల్‌ ప్రైవేట్‌ విద్యార్థులు బాలురు తొమ్మిది మంది పరీక్షలు రాయగా నలుగురు ఉత్తీర్ణులై, 44.44 శాతం పరిమతమయ్యారు. బాలికలు తొమ్మిది మంది పరీక్షలు రాయగా ఏడుగురు ఉత్తీర్ణులై 77.78 శాతం సాధించారు. మొత్తం 18 మంది విద్యార్థులకు గాను 11 మంది ఉత్తీర్ణులు కాగా, 61.11 శాతం సెకండ్‌ ఇయర్‌ ప్రైవెట్‌ ఒకేషనల్‌లో ఉత్తీర్ణత సాధించారు.

గురుకులాల్లో 90 శాతం ఉత్తీర్ణత

జిల్లాలోని ఆరు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ 90 శాతం ఉత్తీర్ణత, ఫస్ట్‌ ఇయర్‌లో 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌లో 440 మంది విద్యార్థులు, సెకండ్‌ ఇయర్‌లో 640 ఉత్తీర్ణత సాధించారు. మద్దూర్‌ గురుకులాల్లో బైపీసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న జ్యోతి 989 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. పేట గురుకులాల్లో ఫస్ట్‌ ఇయర్‌లో శ్రీరాధిక బైపీసీలో 433 మార్కులతో ప్రతిభ చాటింది. నారాయణపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో ఫస్ట్‌ ఇయర్‌లో 243 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 95 మంది ఉత్తీర్ణతతో 39 శాతం సాధించారు. సెకండ్‌ ఇయర్‌ 202 పరీక్ష రాయగా 103 ఉత్తీర్ణతతో 51 శాతం సాధించా రు. కళాశాల టాపర్‌గా సాపూరనూరిన్‌ ఇంగ్లిష్‌ మీడియం ఎంపీసీలో 959 మార్కులు సాధించి ప్రతిభను కనబర్చింది.

Updated Date - Apr 24 , 2024 | 11:19 PM