Share News

ప్రతిభకు ప్రభుత్వ బడులే పునాది

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:22 PM

విద్యార్థుల సంపూర్ణ వికాసంతో పాటు ప్రతిభకు నిలయాలుగా ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తాయని డీఈవో అబ్దుల్‌ ఘనీ అన్నారు.

ప్రతిభకు ప్రభుత్వ బడులే పునాది
వార్షికోత్సవంలో కళారూపాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు

- డీఈవో అబ్దుల్‌ ఘనీ

- చిన్నపొర్ల పాఠశాలలో ఉత్సాహ భరితంగా పాఠశాల వార్షికోత్సవం

ఊట్కూర్‌, ఏప్రిల్‌ 24 : విద్యార్థుల సంపూర్ణ వికాసంతో పాటు ప్రతిభకు నిలయాలుగా ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తాయని డీఈవో అబ్దుల్‌ ఘనీ అన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని చిన్నపొర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సంపూ ర్ణ స్వేచ్ఛతో విద్యాభ్యాసం ఒక సర్కార్‌ బడిలో జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తక్కువ ఏమీ కాదని ఉపాధ్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల తోడ్పాటు ఉంటే అద్భుతాలను సృష్టిస్తారని అన్నారు. కృషి పట్టుదలతో పాటు అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు తోడు కావడంతో మంచి ఫలితాలు సాధించగలుగుతారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రతీ రోజు కొంత సమయం కేటాయించాలని కోరారు. వారితో విద్యాపరమైన విషయాలు సమాజిక అంశాలపై చర్చించ డం ద్వారా వారిలో భయం దూరం అవుతోందన్నారు. భయంపోతేనే కొత్త ఆలోచనలు రెక్కలు తొడుగుతాయన్నారు. పాఠశాల వార్షికోత్సవాలు జరుపుకోవడం ద్వారా వారు మరింత ఉత్సాహవంతంగా పాఠశాల కార్యకలాపాల్లో పాల్గొనాలన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక అవగాహన ఆట - పాటలు కూడా చాలా అవసరం అన్నారు. ఇవి విద్యార్థుల్లో దాగిన కళా నైపుణ్యాన్ని బయటికి వచ్చేలా చేస్తాయని తెలిపారు. విద్యార్థుల కళా ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు. అంతకుముందు ఏఎంవో విద్యాసాగర్‌, సెక్టోరియల్‌ అధికారి నాగార్జునరెడ్డి మాట్లాడారు. అనంతరం విద్యార్థుల ఆటపాటలు అలరించారు. ఎంఈవో వెంకటయ్య, మండల నోడ ల్‌ అధికారి సురేష్‌కుమార్‌, తపస్‌ జిల్లా అధ్యక్షుడు శేర్‌ కృష్ణారెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రసాద్‌, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్‌ భీమమ్మ, ఉపాధ్యాయులు నరసింహా, భాస్కర్‌, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:22 PM