Share News

ఇండియా కూటమిదే అధికారం

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:35 PM

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇం డియా కూటమి దేశంలో అధి కారం చేపడుతుందని రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపడ తారని నాగర్‌కర్నూల్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చి క్కుడు వంశీకృష్ణ అన్నారు.

 ఇండియా కూటమిదే అధికారం
బీకే తిరుమలాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ

- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ

అమ్రాబాద్‌, ఏప్రిల్‌ 27: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇం డియా కూటమి దేశంలో అధి కారం చేపడుతుందని రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపడ తారని నాగర్‌కర్నూల్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చి క్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల పరిధిలో ని జంగారెడ్డిపల్లి, కల్ము లోనిప ల్లి, చింతలోనిపల్లి, తెలుగుప ల్లి, బీకే తిరుమలాపూర్‌, బీకే ఉప్పునుంతల తదితర గ్రా మాల్లో నాగర్‌కర్నూల్‌ కాంగ్రె స్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించడం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విస్తృతం గా ప్రచారం నిర్వహించారు. ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త డాక్టర్‌ మల్లు రవిని ఎంపీగా గెలిపించడం కోసం అహర్నిశలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాం గ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారం చేపడితే సామాజిక న్యాయం కోసం తీవ్రంగా కృషి చేస్తుందని అన్నారు. అనంతరం బీకే తిరుమలాపూర్‌లో వెలసిన ఎల్లమ్మత ల్లి దేవాలయంలో డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, ఆపార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కులమతాలకతీతంగా దర్గాను దర్శించుకోవడం గొప్ప విషయం

లింగాల: మండల పరిధిలోని మగ్ధూంపూర్‌ దర్గాలో కులమతాలక తీతంగా ప్రతీ ఒక్కరు ప్రార్థనలు చేయ డం గొప్ప విషయమని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నా రు. శనివారం దర్గా దగ్గర నిర్వహించిన మగ్దూం షావలి విజయోత్సవా లలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మగ్దూంపూర్‌ దర్గా చాలా మహిమ గలదని, ఇక్కడ ప్రార్థనలు నిర్వహించిన వారు కోరుకున్న మొక్కులు నెరవేరుతాయనే నమ్మకం ప్రతీ ఒక్కరిలో ఉందని అందుకే దర్గా దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు. ముస్లిం పెద్దలు షఫీ, ముక్తార్‌, బారీ, నాయకులు నాగేశ్వర్‌ రావు, కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:35 PM