Share News

సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయండి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:37 PM

నాగర్‌కర్నూల్‌ పార్ల మెంటు నియోజవర్గంలో ఎన్నికలకు సంబంధించి ప్రవ ర్తన నియమావళిని ఉల్లంఘించినట్లైతే ప్రజలు ఎన్నికల కమిషన్‌ రూపొం దించి సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫర్యాదులు చేయాలని నాగర్‌కర్నూ ల్‌ పార్లమెంటు ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరబ్‌ శనివారం ఒక ప్రక టనలో తెలిపారు.

సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయండి

- ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరబ్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 27: నాగర్‌కర్నూల్‌ పార్ల మెంటు నియోజవర్గంలో ఎన్నికలకు సంబంధించి ప్రవ ర్తన నియమావళిని ఉల్లంఘించినట్లైతే ప్రజలు ఎన్నికల కమిషన్‌ రూపొం దించి సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫర్యాదులు చేయాలని నాగర్‌కర్నూ ల్‌ పార్లమెంటు ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరబ్‌ శనివారం ఒక ప్రక టనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ఏదైనా అభ్యం తరాలు, ఫిర్యాదులు ఉంటే కమాండ్‌ కంట్రోల్‌ రూం గ్రీవెన్స్‌ సోర్టల్‌ను సంప్రదించాలని సూచించారు. నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, గద్వాల కలెక్టరేట్‌ కార్యాలయాల్లో సీ విజిల్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎ న్నికల స మయంలో డబ్బు, బహుమతులు, మద్యం పంపిణీ, అ నుమతి లేకుండా ప్రైవేటు ఆస్తులపై పోస్టర్లు, ప్రచారం, ఓటర్లను బెదిరింపులు, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌ స్పీకర్లతో ప్రచారం వంటి ఫిర్యాదులను సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఓటర్లను ప్ర లోభ పెట్టేండుకు మద్యం, డబ్బు, గిప్టుల పంపిణీని ఫొ టోలు, వీడియోలు తీసి సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యా దు చేయాలన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు పరిధి లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని ఆయన కోరారు.

ప్రతి మద్యం దుకాణాన్ని తనిఖీ చేయాలి

తిమ్మాజిపేట: పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ప్రతి మద్యం దుకాణాన్ని ఎక్సైజ్‌ అధికారులు ఆకస్మిక తనిఖీ లు చేయాలని ఎలక్షన్‌ అబ్జర్వర్‌ సౌరబ్‌ సూచించా రు. మండల కేంద్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లాకు మద్యం సరఫరా చేసే మద్యం డిపోను శనివారం ఆయ న సందర్శించి డిపో ఇన్‌చార్జి మేనేజర్‌ వాసైఫ్‌ ఎక్సైజ్‌ అ ధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ న డిపో మేనేజర్‌ ద్వారా పలు విషయాలు అడిగి తెలు సుకున్నారు. డిపోకు సంబంధించి ఎన్ని మద్యం షాపు లు బార్లు ఉన్నాయని అట్టి దుకాణాలకు ఎంత మేరకు మద్యం సరఫరా చేయడం జరిగిందని పూర్తి వివరాలు అడిగారు. అదేవిధంగా డిపోకు ఎన్ని సర్కిళ్లు ఉన్నాయని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ గాయత్రిని అడగగా కల్వకుర్తి, కొల్లాపూర్‌, అచ్చంపేట, మహబూబ్‌నగర్‌లో ఉన్నాయని ఆమె సమాధానం చెప్పారు. అనంత రం తిమ్మాజిపేటలో ని మద్యం దుకాణాన్ని తనిఖీ నిర్వహించారు. ఎక్సైజ్‌ ఎస్‌ఐ బా లీశ్వరి, సూపర్‌వైజర్లు లచ్చయ్య, మధు, శివకు మార్‌, విజయలక్ష్మీ ఉన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:37 PM