Share News

నేటి నుంచి ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:55 PM

తెలంగాణ సార్వ త్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 25 నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు నిర్వహించనున్నారు.

నేటి నుంచి ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ,  ఇంటర్‌ పరీక్షలు
అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ నరసింహస్వామి

- ఐదు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి : చీఫ్‌ సూపరింటెండెంట్‌ నరసింహస్వామి

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 24 : తెలంగాణ సార్వ త్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 25 నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులతో బుధవారం పట్ట ణంలోని విశ్వేశ్వరయ్య మెమోరియల్‌ పాఠశాల లో సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వ హణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చీఫ్‌ సూప రింటెండెంట్‌ ఏ నరసింహస్వామి ఇన్విజిలేటర్లకు వివరించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత గడువుకు గంట ముందే చేరుకోవాలన్నారు. కేం ద్రాల్లోకి ఎలాంటి ఎలక్ర్టానిక్‌ పరికరాలను అను మతించొద్దని చెప్పారు. పరీక్షలు ప్రతీ రోజు ఉద యం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి ఐదు గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, విశ్వేశ్వర్య మెమోరియల్‌ పాఠశాలల్లో నిర్వహించనున్నారు. రెండు కేంద్రాల్లో 500 మంది పరీక్షలు రాయ నున్నారు. ఓపెన్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల, బ్రిలియంట్‌ హై స్కూళ్లలో నిర్వహించనున్నారు. మొత్తం 760 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పరీక్షల కమిషనర్‌ శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - Apr 24 , 2024 | 11:55 PM