Share News

పోలింగ్‌ సజావుగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:50 PM

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

పోలింగ్‌ సజావుగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలి : జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 24 : పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. నామినేషన్ల స్ర్కూటిని, బ్యా లెట్‌ పేపర్‌ ముద్రణ, హోంఓటింగ్‌, ఓటర్‌ స్లిప్పుల పంపిణీ తదితర ఆంశాలపై బుధవారం వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ సంతోష్‌, అదనపు కలెక్టర్లు అపూర్వచౌహాన్‌, ముసిని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ పెండింగ్‌ ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, ఈనెల 26వ తేదీ నాటికి ఓటరు తుది జాబితాను రూపొందించాలన్నారు. ఓటరు స్లిప్పు ల పంపిణీ కోసం నిర్దేశిత షెడ్యూల్‌ రూపొందించి, బూత్‌ స్ధాయి అధికారుల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్‌ అధికారులతో మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్‌ రోజు ఉదయం ముందుగా మాక్‌పోల్‌ నిర్వహించాలన్నారు. ఈవీఎంలలో ఇబ్బందులకు తలెత్తితే, వెంటనే రిజర్వ్‌ ఈవీఎంలను ఏర్పాటు చేసేందుకు సెక్టార్‌ అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో రాంచందర్‌, ఎస్‌డీసీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:50 PM