Share News

షేక్‌స్పియర్‌ రచనలు నిత్యనూతనం

ABN , Publish Date - Apr 23 , 2024 | 11:33 PM

ఆంగ్ల భాషలో అగ్ర శ్రేణి సాహితీవేత్తగా ప్రపంచ ఖ్యాతి గడించిన విలియం షేక్‌స్పియర్‌ రచనలు సజీవం, నిత్య నూతనమని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌బాషా అన్నారు.

షేక్‌స్పియర్‌ రచనలు నిత్యనూతనం
షేక్‌స్పియర్‌ నాటకాల పోస్టర్లను ప్రదర్శిస్తున్న విద్యార్థినులు

- ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌బాషా

- ఘనంగా ఆంగ్ల భాషా దినోత్సవం

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 23 : ఆంగ్ల భాషలో అగ్ర శ్రేణి సాహితీవేత్తగా ప్రపంచ ఖ్యాతి గడించిన విలియం షేక్‌స్పియర్‌ రచనలు సజీవం, నిత్య నూతనమని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌బాషా అన్నారు. స్థానిక మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆంగ్ల భాష దినోత్సవాన్ని, నాటక రచయిత, కవి, సాహితీవేత్త విలియం షేక్‌స్పియర్‌ జయంతిని ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ షేక్‌స్పియర్‌ రచనల్లోని భావ సౌందర్యం, పదాల కూర్పు, రచనా శైలి నేటితరం సాహితీవేత్తలకు, విద్యార్థులకు ఆదర్శప్రాయమన్నారు. ప్రియదర్శిని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌జే సంపత్‌కుమార్‌ మాట్లా డుతూ సాధారణ కుటుంబంలో జన్మించి, తన ప్రతిభతో అంచెలం చెలుగా ఎదిగి, ఆంగ్ల భాషా సాహిత్యానికి కొత్త ఒరవడిని కూర్చిపెట్టిన షేక్‌ స్పియర్‌ జీవితాన్ని విద్యార్థులు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలన్నారు. ఆంగ్ల విభాగం హెచ్‌వోడీ కృష్ణ మూర్తి మాట్లాడుతూ సామాజిక మానవీయ కోణా లను తన రచనల ద్వారా షేక్‌స్పియర్‌ ఆవిష్కరించిన తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన రచనల్లోని కొన్ని కీలక ఘట్టాలకు సంబంధించిన చిత్రాలను విద్యార్థు లు ప్రదర్శించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి. శ్రీపతినాయుడు, అధ్యాప కులు హరిబాబు, హరినాగభూషణం, లలిత, విద్యార్థి నులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 11:33 PM