Share News

ప్రశాంత వాతావరణంలో నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తాం

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:24 PM

ప్రశాంత వాతావరణంలో నామినేషన్‌ స్వీకర ణ ప్రక్రియ పూర్తి చేస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ తెలిపారు.

 ప్రశాంత వాతావరణంలో నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తాం
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌, జిల్లా అధికారులు

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ప్రశాంత వాతావరణంలో నామినేషన్‌ స్వీకర ణ ప్రక్రియ పూర్తి చేస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల చివరి తేదీకి ఏర్పాట్లు, పోస్ట ల్‌ బ్యాలెట్‌ ముద్రణ కోసం తయారీ, హోం ఓటింగ్‌ కోసం ఏర్పాట్లు, ఎన్నికల తదితర అంశాలపై జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు కుమార్‌ దీపక్‌, సీతారామారావు, వనపర్తి అదనపు కలెక్టర్‌ సంచిత గంగ్వార్‌, నోడల్‌ అధికారులతో కలిసి నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పకడ్బందీగా నామినేషన్‌ స్వీకరి స్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి రోజు నామినే షన్ల స్వీకరణ కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు తెలిపారు. ఏప్రిల్‌ 18 నుంచి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ జరుగుతోందన్నారు. నామినేషన్‌ స్వీకరణ, స్కూృట్ని, ఉపసంహరణ, పోటీ చేసే తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, బ్యాలెట్‌ పేప ర్‌ రూపకల్పన వంటి అంశాలను ఎన్నికల కమి షన్‌ మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా నిర్వ హిస్తున్నామని తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌లో నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ జరుగుతుం దని, దాఖలైన నామినేషన్ల స్వీకరణపై ప్రతి రోజు నివేదికలను, నామినేషన్‌, అభ్యర్థుల అఫి డవిట్‌లు పారదర్శకంగా ఆన్‌లైన్‌లో నమోదు చే స్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ అ నంతరం జిల్లా ఎన్నికల అధికారి ఉదయ్‌కుమా ర్‌ అధికారులతో మాట్లాడుతూ ఫారం 12డీ కింద ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియో గించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న అత్యవసర విధుల నిర్వహణ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల నమోదుకు ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రాల ఏర్పాటు చేయాలని, పోస్టల్‌ బ్యాలెట్‌ స్ర్టాంగ్‌ రూమ్‌ సిద్ధం చేయాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రా లకు వచ్చే ఓటర్లకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లాలో వెబ్‌కాస్టింగ్‌ చేస్తున్న పోలింగ్‌ కేంద్రాల వివరాలు సమర్పించాలని మిగిలిన పోలింగ్‌ కేంద్రాల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Updated Date - Apr 24 , 2024 | 11:24 PM