Share News

ప్రజా సమస్యలపై పోరాడుతాం

ABN , Publish Date - Apr 27 , 2024 | 10:59 PM

ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడుతాం
బీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌ రెడ్డి

- బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 27 : ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తా దగ్గర బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల పోరాటంతో తెంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, 10 ఏళ్లు పరిపాలించామన్నారు. పదేళ్ల పాలనలో ప్రజలకు నాణ్యమైన కరెంటును ఇచ్చి రైతులకు ఎంతో దోహదపడిందన్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి ఎన్నో పథకాలను రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండు లక్షల రుణమాఫీ విషయంలో ఎన్నో సాకులు చెబుతూ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు కోరారు.

మక్తల్‌ : బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మక్తల్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చిన్న హన్మంతు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పోరాడి తెలంగాణ సాధించిన ఘతన కేసీఆర్‌కే దక్కిందన్నారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది సాధించిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిక ఆరు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలుపర్చడంలో పూర్తిగా విఫలం అయ్యారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌స్‌ పార్టీ సత్తా చాటి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు గోవర్దన్‌రెడ్డి, అన్వర్‌, జుట్ల శంకర్‌, రఘుపతిరెడ్డి, వన్నెకారి రాజు, మహిమూద్‌, అశోక్‌గౌడ్‌, ఎన్‌బీ నాయుడు, రవి, జుట్ల సాగర్‌, బిల్డర్‌ బాలప్ప, జోగి గణేష్‌కుమార్‌, వర్కూర్‌ రమేష్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 10:59 PM