Share News

పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:08 PM

సిద్దిపేట అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 27: పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలని సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ సూచించారు.

పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలి
పాపను దత్తత ఇస్తున్న అదనపు కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌

సిద్దిపేట అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 27: పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలని సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ సూచించారు. శనివారం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన దంపతులకు జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆరునెలల వయస్సు గల పాపను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అధికారికంగా దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లలను దత్తతకు తీసుకోవాలంటే సిద్దిపేటలో గల శిశు గృహ/జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, బాల రక్ష భవన్‌ కోఆర్డినేటర్‌ మమత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ రాజు, శిశు గృహ మేనేజర్‌ ఝాన్సీ పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:08 PM