Share News

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:02 PM

పుల్‌కల్‌, ఏప్రిల్‌ 27: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని బీజేపీ జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
వెండికోల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌

పుల్‌కల్‌, ఏప్రిల్‌ 27: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని బీజేపీ జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రం పుల్కల్‌తో పాటు వెండికోలు గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పదేళ్లుగా జహీరాబాద్‌ ఎంపీగా ప్రజలకు సేవలందించానని, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీలో చేరి మూడోసారి పోటీ చేస్తున్నానని తెలిపారు. మోదీ అండదండలతో తాను హ్యాట్రిక్‌ ఎంపీగా గెలుపొంది రికార్డు బ్రేక్‌ చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని మోదీకి బహుమతిగా ఇవ్వాల్సిన తరుణం అసన్నమైందన్నారు. సంగారెడ్డి-నాందేడ్‌, అకోలా 161 జాతీయ రహదారి కేంద్ర ప్రభుత్వం అండతోనే నాలుగు లైన్లుగా విస్తరణ చేపట్టానని గుర్తు చేశారు. కాగా వెండికోలు బీఆర్‌ఎస్‌ గ్రామ సీనియర్‌ నాయకుడు, మాజీ సర్పంచ్‌ భోజన్నగారి శ్రీనివా్‌సగౌడ్‌ అధ్వర్యంలో గ్రామ అధ్యక్షుడు నీరుడి మహేశ్‌ముదిరాజ్‌, నాయకులు బేగరి కుమార్‌, కిష్టయ్య, పద్మయ్య, సిరిపురం లక్ష్మయ్య, ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు పాండుతో పాటు మరో 50 మంది అనుచరులు బీబీపాటిల్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావుకులకర్ణి, నాయకులు ఏ.వెంకటనర్సింహారెడ్డి, పల్వట్ల జగదీశ్వర్‌, రమేశ్‌బస్వరాజ్‌పాటిల్‌, మంఠం చంద్రశేఖర్‌, చౌటకూర్‌, పుల్కల్‌ మండలాల అధ్యక్షులు నీరుడి ప్రవీణ్‌కుమార్‌ముదిరాజ్‌, పండరి పాల్గొన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం

పెద్దశంకరంపేట, ఏప్రిల్‌ 27: పార్లమెంట్‌ ఎన్నికల్లో 400కు పైగా స్థానాలు గెలుచుకొని మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని బీజేపీ జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ అన్నారు. శనివారం బీజేపీ మండలాధ్యక్షుడు కోణం విఠల్‌ ఆధ్వర్యంలో చీలపల్లి, కమలాపూర్‌, గ్రామాలకు చెందిన 50 మందికి పైగా యువకులు బీబీపాటిల్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువకులు, మహిళలు అన్నివర్గాల ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ మూడోసారి కమలం గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్‌ ఎంపీగా తనను ఆశీర్వదించి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, మాజీ సర్పంచులు అశోక్‌, సూర్యప్రకాష్‌, శ్రీశైలం, శ్రావణ్‌కుమార్‌, మంగలికృష్ణ, గంగారెడ్డి, చీలపల్లి, కమలాకర్‌ గ్రామాలకు చెందిన రోషిరెడ్డి, కృష్ణారెడ్డి, గంగయ్య, దుర్గేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:02 PM