Share News

Bangalore: కాదన్నందుకే కడతేర్చాడు...

ABN , Publish Date - Feb 21 , 2025 | 12:08 PM

చిక్కమగళూరు(Chikmagalur) తాలూకా దాసరహళ్ళిలో ఇద్దరి మృతికి సంబంధించి పోలీసులు వాస్తవాలను వెలికి తీశారు. హైస్కూల్‌ టీచర్‌ను హత్య చేసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తేల్చారు.

Bangalore: కాదన్నందుకే కడతేర్చాడు...

- ప్రేమ నిరాకరించినందుకే హైస్కూల్‌ టీచర్‌ హత్య

- ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య

- చిక్కమగళూరు జిల్లా ఘటనపై పోలీసులు

బెంగళూరు: చిక్కమగళూరు(Chikmagalur) తాలూకా దాసరహళ్ళిలో ఇద్దరి మృతికి సంబంధించి పోలీసులు వాస్తవాలను వెలికి తీశారు. హైస్కూల్‌ టీచర్‌ను హత్య చేసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తేల్చారు. గురువారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు శివమొగ్గ జిల్లా భధ్రావతికి చెందిన మధు(28) బెంగళూరులో స్థిరపడ్డారు. మాగడిలోని ఓ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేసే పూర్ణిమ(25) పక్కపక్కన ఇళ్లలోనే నివసించేవారు.

ఈ వార్తను కూడా చదవండి: Birthday: వారం ముందే సీఎం స్టాలిన్‌ జన్మదిన వేడుకలు..


రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండేవి. మధు కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇద్దరి ఇళ్లలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కలిసి పాల్గొనేవారు. ఎనిమిది నెలల కిందట పూర్ణిమ చెల్లెలి పెళ్లికాగా మధు క్రియాశీలకంగా పనిచేశాడు. ఇతడి కారునే అద్దెకు వాడుకున్నారు. ఇటీవల పూర్ణిమను ప్రేమిస్తున్నట్లు మధు(Madhu) చెప్పగా అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. గతవారం పాఠశాల ముగించుకుని ఇంటికి వెళుతున్న పూర్ణిమను గుర్తించిన మధు కారులో డ్రాప్‌ చేస్తానంటూ నమ్మబలికాడు. పాఠశాల నుంచి పూర్ణిమ ఇంటికి 20 కిలోమీటర్ల దూరంకాగా ఏకంగా చిక్కమగళూరుకు తీసుకెళ్లాడు.


యువతిని కారులోనే గొంతునులిమి హత్యచేశాడు. అందుకు సంబంధించిన ఆధారాలు పోలీసులు గుర్తించారు. కారును అక్కడే వదిలేసి సమీపంలోని ఓ చెట్టుకు ఆమెకు చెందిన చున్నీతో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు చిక్కమగళూరు గ్రామీణ పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా ప్రేమను కాదన్నందుకే పూర్ణిమను హత్య చేసి మధు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు.


ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట

ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా

ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్‌ గురుదక్షిణ

ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2025 | 12:08 PM