Share News

సైబర్ దాడులతోనూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయొచ్చు: ప్రధాని హెచ్చరిక

ABN , Publish Date - Oct 25 , 2026 | 08:37 PM

యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే జరగవని, సైబర్ దాడుల ద్వారా కూడా దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

సైబర్ దాడులతోనూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయొచ్చు: ప్రధాని హెచ్చరిక
Modi Cyber Terrorism Warning

భువనేశ్వర్‌, అక్టోబర్ 25: భువనేశ్వర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ శిక్షణా సంస్థను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే జరగడం లేదని, ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేయడం ద్వారా కూడా దాన్ని బలహీనపరచవచ్చని మోదీ పేర్కొన్నారు.

భారతదేశం ఆర్థికంగా ఎదుగుతున్న కొద్దీ, మన డిజిటల్ మౌలిక వసతులను, బ్యాంకింగ్ వ్యవస్థను సైబర్ నేరగాళ్లు, సైబర్ ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని ప్రధాని చెప్పారు. పాతకాలపు పద్ధతులు, పాత శిక్షణా పరికరాలతో ఆధునిక సైబర్ ముప్పులను ఎదుర్కోలేమని, ఇందుకోసం సమర్థవంతమైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవవనరులు అవసరమని స్పష్టం చేశారు.

గత దశాబ్దం బ్యాంకింగ్ సేవలు లేని పేద ప్రజలకు ఖాతాలు అందించడంపై దృష్టి పెడితే, రాబోయే దశాబ్దం బ్యాంకింగ్ వ్యవస్థను మరింత నమ్మకమైనదిగా, సమర్థవంతమైనదిగా మార్చడంపై దృష్టి పెడుతుందని మోదీ చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విధానపరమైన లోపాల వల్ల భారతదేశ బ్యాంకింగ్ రంగం నిరర్ధక ఆస్తుల సంక్షోభంలో కూరుకుపోయి, కుప్పకూలే స్థితికి చేరిందని ఆరోపించారు. 2014 కంటే ముందు ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకుల ప్రతినిధులు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు బడా బాబులకు వేల కోట్ల రుణాలు ఇచ్చేవారని ఎద్దేవా చేశారు. సామాన్యుడికి బ్యాంకు ఖాతా తెరవడానికే పూచీకత్తు కావలసి వచ్చేదని చెప్పుకొచ్చారు.

1960, 70లలో పేదల పేరిట ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణ చేసినప్పటికీ, 2014 వరకు దేశంలో సగానికి పైగా జనాభాకు బ్యాంకింగ్ సేవలు అందలేదని ప్రధాని వ్యాఖ్యనించారు. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఒడిశాలోనే మాట్లాడుతూ 'ఢిల్లీ నుంచి రూపాయి పంపితే ప్రజలకు 15 పైసలే చేరుతోంది' అన్నారని, కానీ నేటి ప్రభుత్వంలో 59-60 కోట్లకు పైగా 'జన్ ధన్' ఖాతాల ద్వారా ఢిల్లీ నుంచి పంపిన ప్రతి రూపాయి నేరుగా లబ్ధిదారుడి ఖాతాకే పూర్తి స్థాయిలో చేరుతోందని మోదీ వివరించారు. (Modi Cyber Terrorism Warning)


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క

ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 08:47 PM