పాల్గఢ్ మూకహత్య కేసు.. మరో ఐదుగురికి సీఐడీ కస్టడీ..

ABN , First Publish Date - 2020-05-02T00:05:04+05:30 IST

పాల్గఢ్ మూకహత్య కేసులో శుక్రవారం అరెస్టైన ఐదురుగు నిందితులను ఈ నెల 13 వరకు సీఐడీ కస్టడీకి..

పాల్గఢ్ మూకహత్య కేసు.. మరో ఐదుగురికి సీఐడీ కస్టడీ..

పాల్గఢ్: పాల్గఢ్ మూకహత్య కేసులో శుక్రవారం అరెస్టైన ఐదురుగు నిందితులను ఈ నెల 13 వరకు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది. కాగా బుధవారం పోలీసులు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పాల్గఢ్ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 115 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిలో 9 మంది మైనర్లు కూడా ఉన్నట్టు తెలిపారు. ఏప్రిల్ 16న ముంబైలోని కండీవలీ నుంచి గుజరాత్ వెళుతున్న ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్‌ను కొట్టిచంపిన ఘటనపై విచారణ జరుగుతోంది. దొంగలు సంచరిస్తున్నారన్న పుకార్ల కారణంగానే పాల్గఢ్‌లోని గడ్చించ్లే గ్రామస్తులు వీరిని కొట్టిచంపినట్టు చెబుతున్నారు. 

Updated Date - 2020-05-02T00:05:04+05:30 IST