భార్యకు కరోనా పాజిటివ్ ఉందని తెలిసి ఉరేసుకున్న భర్త..

ABN , First Publish Date - 2020-05-02T00:24:05+05:30 IST

తన భార్యకు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించిన కొద్ది సేపటికే 54 ఏళ్ల ఓ వ్యక్తి ఆత్మహత్యకు...

భార్యకు కరోనా పాజిటివ్ ఉందని తెలిసి ఉరేసుకున్న భర్త..

గురుగ్రామ్: తన భార్యకు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించిన కొద్ది సేపటికే 54 ఏళ్ల ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన వైనమిది. గురుగ్రామ్‌లోని ఆచార్యపురిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ‘‘గురువారం రాత్రి అతడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలం వద్ద సూసైడ్ నోట్ కూడా కనిపించలేదు..’’ అని గురుగ్రామ్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామన్నారు. పోస్టుమార్టానికి ముందే అతడికి కరోనా సోకిందా లేదా అన్నది నిర్ధారించాల్సి ఉందన్నారు. 

Updated Date - 2020-05-02T00:24:05+05:30 IST