ఒక్క నిమిషంలో కొవిడ్‌ ఫలితం

ABN , First Publish Date - 2020-10-30T08:12:40+05:30 IST

కరోనా సోకిందీ లేనిదీ తెలుసుకోవడానికి.. ఆర్టీపీసీఆర్‌ టెస్టు అయితే ఒకరోజు సమయం పడుతుంది. యాంటీజెన్‌ పరీక్ష అయితే అదే రోజు తెలుస్తుంది...

ఒక్క నిమిషంలో కొవిడ్‌ ఫలితం

సింగపూర్‌: కరోనా సోకిందీ లేనిదీ తెలుసుకోవడానికి.. ఆర్టీపీసీఆర్‌ టెస్టు అయితే ఒకరోజు సమయం పడుతుంది. యాంటీజెన్‌ పరీక్ష అయితే అదే రోజు తెలుస్తుంది. కానీ.. సింగపూర్‌కు చెందిన బ్రీతోనిక్స్‌ అనే సంస్థ.. ఒక్క నిమిషం లో తేల్చి చెప్పే బ్రీతలైజర్‌ను తయారుచేసిం ది. ఈ పరికరం పనితీరును పరిశీలించేందుకు 180 మందిపై పరీక్షించగా.. కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులను గుర్తించడంలో ఈ పరికరం 90శాతం కచ్చితత్వంతో, నెగెటివ్‌లను గుర్తించడంలో 95శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్నట్టు తే లింది. పరిశోధనలో పాల్గొన్న 180 మందిలో 50 మంది ఇప్పటికే పాజిటివ్‌గా తేలినవారు. వారిలో ప్రతి 10మందిలో 9 మందికి వైరస్‌ సోకినట్టు ఈ బ్రీతలైజర్‌ కచ్చితంగా గుర్తించింది. అయితే, ఈ పరికరానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉంది.  

Updated Date - 2020-10-30T08:12:40+05:30 IST