ప్రణబ్‌-కేసీఆర్‌ ఆత్మీయ అనుబంధం

ABN , First Publish Date - 2020-09-01T07:45:35+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రణబ్‌ముఖర్జీతో ఆత్మీయ అనుబంధం ఉంది. కేంద్రంలోని యూపీఏ సర్కారులో టీఆర్‌ఎస్‌ భాగస్వామిగా చేరినప్పటి నుంచీ వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ప్రణబ్‌ అనుకూలంగా ఉండేవారు...

ప్రణబ్‌-కేసీఆర్‌ ఆత్మీయ అనుబంధం

  • ఆయన పుస్తకంలో కేసీఆర్‌ ప్రస్తావన 

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రణబ్‌ముఖర్జీతో ఆత్మీయ అనుబంధం ఉంది. కేంద్రంలోని యూపీఏ సర్కారులో టీఆర్‌ఎస్‌ భాగస్వామిగా చేరినప్పటి నుంచీ వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ప్రణబ్‌ అనుకూలంగా ఉండేవారు. 2004లో యూపీఏ భాగస్వామ్య పక్షాలకు శాఖల కేటాయింపులో ఆయన కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే తనకు ముఖ్యమని కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని ప్రణబ్‌ స్వయంగా రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. ప్రణబ్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పడగా.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రణబ్‌ రాష్ట్రానికి వచ్చిన సమయంలో కేసీఆర్‌ ప్రత్యేకంగా ఆయనకు స్వాగతం పలికేవారు. ప్రణబ్‌కు పాదాభివందనాలు చేసేవారు. ప్రణబ్‌ ఆయనతో కలిసి యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన చండీ యాగానికి కూడా ప్రణబ్‌ను ఆహ్వానించారు. అయితే యాగశాలలో స్వల్ప అగ్ని ప్రమాదం జరగడంతో భద్రతా కారణాల దృష్ట్యా చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.



Updated Date - 2020-09-01T07:45:35+05:30 IST