వంటింటి పద్ధతితో మాస్కుల్ని మళ్లీ మళ్లీ వాడొచ్చు!

ABN , First Publish Date - 2020-08-31T00:59:13+05:30 IST

కరోనా వచ్చిన తర్వాత మాస్కులకు డిమాండ్ ఎంతలా పెరిగిపోయిందో మనకి తెలిసిందే. మాస్క్ అనేది నిత్యావసర వస్తువుగా..

వంటింటి పద్ధతితో మాస్కుల్ని మళ్లీ మళ్లీ వాడొచ్చు!

కరోనా వచ్చిన తర్వాత మాస్కులకు డిమాండ్ ఎంతలా పెరిగిపోయిందో మనకి తెలిసిందే. మాస్క్ అనేది నిత్యావసర వస్తువుగా తేలిపోయింది. అయితే ఇంట్లోనుంచి బయటకు వెళ్లి వచ్చినప్పుడల్లా కొత్త మాస్క్  మార్చడం ఇబ్బంది అయితే ఎన్-95 లాంటి స్టాండెండ్ మాస్కులు కొనుక్కో గలిగితే ఒక మాస్కును తిరిగి పదే పదే వాడుకుంటూ ఉండవచ్చు. అయితే ఒకసారి వాడిన తర్వాత వాటిని డీ కంటర్నైట్ చేయడం అవసరం. ఇలా స్టెరిలైజ్ శానిటైజ్ చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అసలు ఈ మధ్య ఎన్-95 మాస్కులు దొరకడమే కష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అవి వైరస్ నుంచి మనిషిని రక్షించడంలో ఎంతో సమర్థమైన మాస్కులుగా పేరు తెచ్చుకున్నాయి. 


అయితే వీటిని పదే పదే స్టెరిలైజ్ చేయడం ఇబ్బందితో కూడుకున్న పని. ఎందుకంటే ఎంతలేదన్నా అది ఒక మెడికల్ ప్రాసెస్. అలాగని స్టెరిలైజ్ శానిటైజ్ చేయడకుండా మాస్క్‌ను మాటమాటకు ఉపయోగిస్తే దాని వల్ల ఉపయోగం ఉండదు సరికదా.. ఒక్కోసారి డేంజర్ కూడా. అయితే ఎన్95 మాస్కులను శానిటైజ్ చేయడానికి ఇకపై పెద్దగా కష్టపడాల్సిన పని లేదట. మామూలు ప్రెషర్ కుక్కర్‌లో నలభై నిమిషాల పాటు ఉంచితే అది పూర్తిగా పరిశుభ్రమై తిరిగి కొత్త మాస్కు మాదిరిగా వాడుకోవడానికి సిద్ధంగా మారిపోతుందని పరిశోధకులు తేల్చేశారు. మామూలుగా అల్ర్టావైలెట్ కాంతిని ఉపయోగించి ఎన్-95 మాస్కులను క్లీన్ చేస్తూ  ఉంటారు. అయితే ఆ సైంటిఫిక్ పద్ధతి కంటే కూడా సామాన్యమైన ఈ ప్రెషర్ కుక్కర్ పద్ధతి ఇంకా ప్రభావశీలంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 

Updated Date - 2020-08-31T00:59:13+05:30 IST