లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్!

ABN , First Publish Date - 2020-09-01T17:47:57+05:30 IST

లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి మారటోరియం పెంచే యోచనలో కేంద్రం ఉంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంలో సామాన్యులు కూరుకుపోయిన విషయం తెలిసిందే.

లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్!

న్యూఢిల్లీ: లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి మారటోరియం పెంచే యోచనలో కేంద్రం ఉంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంలో సామాన్యులు కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండేళ్ల వరకు మారటోరియం గడువు పెంచేందుకు సన్నద్ధమవుతున్నట్టు సుప్రీం కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విన్నవించారు. కేంద్రం, ఆర్బీఐ తరఫున ఆయన వాదనలు వినిపించారు. మారటోరియంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈఎంఐలపై అదనపు వడ్డీ విధించొద్దని పేర్కొంది. చెల్లించని ఈఎంఐలపైనా పెనాల్టీ విధించొద్దని ఆదేశించింది. రేపు పూర్తిస్థాయిలో వాదనలు వింటామని తెలిపింది. పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది.  

Updated Date - 2020-09-01T17:47:57+05:30 IST