సబ్సిడీయేతర గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా తగ్గింపు

ABN , First Publish Date - 2020-05-01T21:12:32+05:30 IST

న్యూఢిల్లీ: సబ్సిడీయేతర గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా తగ్గాయి. రూ. 162.50 తగ్గించారు. గత మూడు నెలల్లో రేట్లు తగ్గడం వరుసగా ఇది

సబ్సిడీయేతర గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా తగ్గింపు

న్యూఢిల్లీ: సబ్సిడీయేతర గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా తగ్గాయి. రూ. 162.50 తగ్గించారు. గత మూడు నెలల్లో రేట్లు తగ్గడం వరుసగా ఇది మూడోసారి. గృహాసరాలకోసం తీసుకునే గ్యాస్ సిలెండర్లపై సబ్సిడీ వదులుకున్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే వారి కోటా ఏడాదికి 12 దాటితేనే. 14.2కేజీల సిలెండర్‌పై ఈ తగ్గింపు వర్తిస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో గ్యాస్ సిలెండర్ ధరలు కూడా తగ్గుతున్నాయి. 


తగ్గిన రేట్ల ప్రకారం ఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్ సిలెండర్(సబ్సిడీయేతర) ధర రూ.581.50. ముంబైలో 579 రూపాయలు. 


వాణిజ్య అవసరాల కోసం వాడే 19 కేజీల ఎల్‌పీజీ సిలెండర్ల ధరలు కూడా తగ్గాయి. 1,285 రూపాయల నుంచి రూ 1029.50కు చేరుకున్నాయి. 

Updated Date - 2020-05-01T21:12:32+05:30 IST