బ్యూటీఫుల్.. నెటిజన్ ట్వీట్‌పై మోదీ రెస్పాన్స్ ఇది!

ABN , First Publish Date - 2020-08-31T21:12:58+05:30 IST

మోదీ పిలుపును అందుకున్న ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘ఇది మధోల్ జాతి జాగిలం. పూర్తిగా భారత్‌కు చెందినది. గట్టి కాపాలా కాసే ప్రేమాస్పదమైన జాగిలం’ అని తన పెంపుడు కుక్కను గురించి సదరు నెటిజన్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కు ఆ జాగిలం ఫొటో జత చేశారు. ప్రధాని మోదీని కూడా ట్యాగ్ చేశారు. మరి సహజంగానే.. స్వావలంబన దిశగా ముందడు గేసిన సదరు నెటిజన్ ప్రధాని మోదీని ఆకట్టుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన ప్రధాని.. ఇది ఎంతో అందమైన ఫొటో అంటూ ట్వీట్ చేశారు.

బ్యూటీఫుల్.. నెటిజన్ ట్వీట్‌పై మోదీ రెస్పాన్స్ ఇది!

ఇంటర్నెట్ డెస్క్:  ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ కోసం పాటుపడాలంటూ దేశ ప్రజలకు పలు మార్లు పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగం నుంచి ఆట వస్తువుల వరకూ అన్ని రంగాల్లో భారత్ స్వావలంబన సాధించాలన్నారు. ఈ క్రమంలో.. ఆదివారం నాడు ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ మోదీ స్వావలంబనకు గల ప్రాధాన్యాన్ని మరో మారు ప్రస్తావించారు. ఈ సందర్భంగా స్వదేశీ బ్రీడ్‌ల జాగిలాలను పెంచుకోవాలంటూ ప్రజలకు సూచించారు. 


ఆయన పిలుపును అందుకున్న ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘ఇది ముధోల్ జాతి జాగిలం. పూర్తిగా భారత్‌కు చెందినది. గట్టి కాపాలా కాసే ప్రేమాస్పదమైన జాగిలం’ అని తన పెంపుడు కుక్కను గురించి సదరు నెటిజన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు తన పెంపుడు కుక్క ఫొటోను కూడా జత చేశారు. ప్రధాని మోదీని కూడా ట్యాగ్ చేశారు. ఇలా స్వావలంబన దిశగా ముందడు గేసిన సదరు నెటిజన్.. ప్రధాని మోదీని ఆకట్టుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన ప్రధాని.. ఇది ఎంతో అందమైన ఫొటో అంటూ ట్వీట్ చేశారు. 




Updated Date - 2020-08-31T21:12:58+05:30 IST