భయం వద్దు.. 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయి: కేంద్రం

ABN , First Publish Date - 2020-05-02T00:19:40+05:30 IST

దేశీయంగా కోవిడ్-19 పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం శుక్రవారం 2.22 కోట్ల పర్సనల్

భయం వద్దు.. 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయి: కేంద్రం

న్యూఢిల్లీ: దేశీయంగా కోవిడ్-19 పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం శుక్రవారం 2.22 కోట్ల పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లకు ఆర్డర్ ఇచ్చింది. వీటిలో 1.43 కోట్లు దేశీయంగా తయారుకానున్నాయి. దేశంలోని కోవిడ్-19 పరిస్థితిపై ఎంపవర్డ్ గ్రూప్-3 చైర్మన్ పీడీ వాఘేలా మాట్లాడుతూ.. దేశంలో 19,398 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. అలాగే, మరో 60,884 వెంటిలేటర్లు ఆర్డర్ చేసినట్టు చెప్పారు. వీటిలో 59,884 వెంటిలేటర్లు దేశీయ కంపెనీలు తయారు చేస్తాయని వివరించారు. 2.49 కోట్ల ఎన్-95/ఎన్-99 మాస్కులకు ఆర్డర్ చేసినట్టు చెప్పారు. వీటిలో 1.49 కోట్ల మాస్కుల తయారీకి దేశీయ తయారీదారులకు ఆర్డర్ చేసినట్టు చెప్పారు.  


డ్రగ్స్, వైద్య పరికరాల గురించి వాఘేలా మాట్లాడుతూ.. హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ) ఉత్పత్తి నెలకు 12.23 కోట్ల నుంచి 30 కోట్లకు పెరిగినట్టు చెప్పారు. అలాగే, 4 లక్షలకు పైగా ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి అవసరాలకు సరిపడా ఉన్నాయని, మరో లక్షకు పైగా ఆక్సిజన్ సిలిండర్లకు ఆర్డర్లు ఇచ్చినట్టు తెలిపారు. అలాగే, ఇండస్ట్రియల్ ఆక్సిజన్‌ను మెడికల్ ఆక్సిజన్‌గా మారుస్తున్నట్టు చెప్పారు.  

Updated Date - 2020-05-02T00:19:40+05:30 IST