ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’ వీడియోకు ఇన్ని లక్షల డిస్‌లైక్‌లా..!

ABN , First Publish Date - 2020-09-01T14:08:52+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 30న జాతినుద్దేశించి మాట్లాడిన ‘మన్ కీ బాత్’ వీడియోకు మునుపెన్నడూ లేనంతంగా...

ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’ వీడియోకు ఇన్ని లక్షల డిస్‌లైక్‌లా..!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 30న జాతినుద్దేశించి మాట్లాడిన ‘మన్ కీ బాత్’ వీడియోకు మునుపెన్నడూ లేనంతంగా డిస్‌లైక్‌లు వెల్లువెత్తాయి. ఆగస్ట్ నెలకు సంబంధించిన ‘మన్ కీ బాత్’ వీడియోను బీజేపీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయగా 8లక్షల 50వేలకు పైగా డిస్‌లైక్స్ ఇప్పటివరకూ నమోదయ్యాయి. అయితే.. ప్రధాని వీడియో పట్ల ఇంతలా అసంతృప్తి వ్యక్తం చేసింది విద్యార్థులేనన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.


నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్‌కు కేంద్రం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో విద్యార్థుల్లో కొందరు ఈ రూపంలో తమ నిరసనను వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోకు వచ్చిన కామెంట్లలో ఎక్కువగా పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ ఉండటం ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది. ఇదిలా ఉంటే.. జేఈఈ(మెయిన్) పరీక్షలు దేశవ్యాప్తంగా నేడు మొదలయ్యాయి.

Updated Date - 2020-09-01T14:08:52+05:30 IST